Breaking News

మరో కోట శ్రీనివాసరావు పుట్టరు, రారు: ఎన్టీఆర్‌ ఎమోషనల్‌

Published on Mon, 07/14/2025 - 08:36

లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మరణం తనను ఎంతగానో కలిచివేసిందంటున్నాడు హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని కోట శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కోటతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.

శకం ముగిసింది
జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు మరణంతో ఒక శకం ముగిసింది. ఎన్నో సినిమాల్లో ఆయనతో కలిసి పని చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మహనీయుడైన నటుడితో పని చేయడం నా పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఆయన లేకపోవడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఎక్కడున్నా తన చల్లని చూపు మనందరిపై ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

కోట శ్రీనివాసరావు ఒక్కరే
యాక్టింగ్‌ ఇండస్ట్రీకి, నటనకు నిలువెత్తురూపం కోట శ్రీనివాసరావుగారు. తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక్కరే.. మరో కోట పుట్టరు, రారు! అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఆయన మనకు మిగిల్చి వెళ్లిన ఎన్నో అద్భుతమైన పాత్రల్ని, సినిమాలను ప్రేక్షకులు చూసి ఆస్వాదించండి అంటూ తారక్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా 750కి పైగా సినిమాలు చేసిన కోట శ్రీనివాసరావు ఆదివారం (జూలై 13న) కన్నుమూశారు.

చదవండి: Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్లు సంపాదిస్తేనేం?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)