Breaking News

ఫుల్ బిజీగా జూనియర్ ఎన్టీఆర్‌.. వార్‌-2 కోసం ఎంట్రీ!

Published on Wed, 06/11/2025 - 19:10

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్‌ కూడా జరిగింది. ఈ మూవీ పనులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ హృతిక్ రోషన్‌ నటిస్తోన్న వార్‌-2 చిత్రంలో విలన్‌ పాత్రలో మెప్పించనున్నారు.  ఇప్పటికే ఈ మూవీ షూట్ దాదాపు పూర్తయింది.

ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్‌ వార్-2 డబ్బింగ్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన డబ్బింగ్‌ చెప్పేందుకు స్టూడియోలో ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ ద్వారానే యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

కాగా.. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.  మే 20న జూనియర్ ఎన్టీఆర్  పుట్టినరోజు సందర్భంగా వార్ 2 టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గతంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 2019 బ్లాక్‌బస్టర్ వార్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ భారీ యాక్షన్‌ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)