Breaking News

ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ వేట ప్రారంభం.. ఫోటోలు విడుదల

Published on Sun, 04/20/2025 - 11:08

ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌  ప్రాజెక్ట్‌ (#NTRNEEL) నుంచి కీలకమైన అప్డేట్‌ వచ్చేసింది. వేట ప్రారంభమైంది అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తారక్‌ ఫోటోలను విడుదల చేసింది.  ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్‌ (NTR) సెట్లోకి రానున్న సంగతిని ప్రకటించిన మేకర్స్‌ తాజాగా ఆయన ఫోటోలను విడుదల చేశారు. ‘దేవర’ తర్వాత  ఎన్టీఆర్‌.. ‘సలార్‌’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ఇలా ఇద్దరూ తెలుగులో కలిసి చేస్తున్న చిత్రమిదే కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ చాలా రోజుల క్రితమే మొలైంది. ఎన్టీఆర్‌ లేకుండా, ఇతర తారాగణంపై ప్రశాంత్‌ నీల్‌ కొన్ని సీన్స్‌ తెరకెక్కించారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ జనవరి 9న విడుదల కానుంది.

(ఇదీ చదవండి: బాలకృష్ణ కారుకు ఫ్యాన్సీ నంబర్‌.. ఎన్ని లక్షలో తెలుసా..?) 

ఈ ప్రాజెక్ట్‌ విషయానికి వస్తే.. తారక్‌ నటిస్తోన్న 31వ చిత్రమిది. షూటింగ్‌లో భాగంగా కొద్దిరోజుల క్రితమే రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేసి అక్కడ కొన్ని సీన్స్‌ చిత్రీకరించారు. అయితే, ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోయే సీన్లు మాత్రం  శ్రీలంకలోని కొలంబోలో ప్లాన్‌ చేశారు. ఆల్రెడీ యూనిట్‌లోని కీలక సాంకేతిక నిపుణులు కొలంబో వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను ఫైనల్‌ చేశారని తెలిసింది.  అందుకోసం తారక్‌ ఇప్పటికే కొలంబో చేరుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌(Jr NTR), ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) కాంబోలో తెరకెక్కుతున్న  ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో  పీరియాడికల్‌ స్టోరీతో నిర్మిస్తున్నారు . ఇందులో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

‘సలార్’ సినిమా  ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ప్రభాస్‌ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సినిమా విషయంలోనూ  ఫాలో అవుతాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు(NTR Birthday) సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నట్టు టాక్‌. ఇందులో మలయాళ యువ హీరో టొవినో థామస్‌ కీలక పాత్రలో సందడి చేయనున్నట్లు సమాచారం.  దీనికి రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)