Breaking News

రూ. 84 కోట్లు పెట్టి ఇల్లు కొన్న స్టార్‌ హీరో

Published on Tue, 07/21/2026 - 13:33

సినిమా హీరోలు తమ డబ్బులకు ఎక్కువగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెడుతుంటారు. పారితోషికంగా సంపాదించిన డబ్బులతో బంగ్లాలు కొనుగోలు చేసి.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం రూ. 84 కోట్లతో విలాసవంతమైన బంగ్లాను ఆయన కొనుగోలు చేశాడు.  రియల్ ఎస్టేట్ రికార్డుల ప్రకారం, ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 14న పూర్తయింది. ఈ కొనుగోలుకు గాను ఆయన సుమారు రూ. 5.04 కోట్ల రూపాయలను స్టాంప్ డ్యూటీ రూపంలో చెల్లించినట్లు సమాచారం.

ఈ ఆస్తి మొత్తం 1,017.60 చదరపు మీటర్ల ఫ్లాట్‌లో విస్తరించి ఉంది. ఇందులో 193.12 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతం కలిగిన బంగ్లాతో పాటు 31.50 చదరపు మీటర్ల అవుట్‌హౌస్ కూడా ఉంది. ముంబైలో ప్రముఖ సినీ తారలు - విఐపిలు నివసించే ప్రైమ్ లొకేషన్లలో బాంద్రా వెస్ట్ ఒకటి. ఇక్కడ స్వంత స్థలంతో ఉన్న బంగ్లాలు దొరకడం అత్యంత అరుదు కావడం వల్ల జాన్ చేసిన ఈ రూ. 84 కోట్ల బిగ్ డీల్ ప్రస్తుతం సినీ, బిజినెస్ వర్గాల్లో వైరల్‌గా మారింది.

జాన్ అబ్రహం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. డిసెంబర్ 2023లో కూడా ముంబైలోని ఖార్ ఏరియాలో రూ. 70.83 కోట్ల విలువైన బంగ్లాను ఆయన సొంతం చేసుకున్నారు.

ఇక సినీ కెరీర్‌ విషాయానికొస్తే.. ఇటీవల 'ది డిప్లొమాట్', 'తెహ్రాన్' వంటి వైవిధ్యమైన యాక్షన్- పొలిటికల్ థ్రిల్లర్లతో అలరించాడు. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాకేష్‌ మారియా బయోపిక్‌తో పాటు త‌న‌ కెరీర్‌లో సూపర్ హిట్ అయిన యాక్షన్ ఫ్రాంచైజ్ 'ఫోర్స్' మూడో భాగం -ఫోర్స్ 3 లో నటిస్తున్నాడు. ఈ రెండింటిలోనూ జాన్‌ అబ్రహం పోలీసులు ఆఫీసర్‌గా అలరించబోతున్నాడు. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌