'జో' సినిమా కాంబో రిపీట్‌.. ఈసారి ఎలాంటి స్టోరీ అంటే..

Published on Sat, 05/04/2024 - 09:00

గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా కోలీవుడ్‌లో విడుదలైన సినిమా 'జో'. హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. దీంతో ఈ చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఇందులో రియోరాజ్,  మాళవిక మనోజ్‌ జంటగా  నటించారు. వారిద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా కోలీవుడ్‌లో ఈ కాంబో మరోసారి రిపీట్‌ కానుంది. కాగా ఇంతకుముందు హరి ముత్తయ్య వంటి దర్శకులతో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను నిర్మించిన డ్రమాటిక్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మణికంఠన్‌ కందస్వామి సమర్పణలో రూపొందుతున్న నూతన చిత్రం   చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.

ఇందులో నటుడు రియోరాజ్, నటి మాళవిక మనోజ్‌ హీరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బ్లాక్‌ షిప్‌ కలైయరసన్‌ తంగవేలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బ్లాక్‌ షీప్‌ ఆర్జె విగ్నేష్‌, షీలా రాజకుమార్, డైరెక్టర్‌ ఏ వెంకటేశ్‌, గజరాజన్, జాన్సన్‌ దివాకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మధేశ్‌ మాణిక్‌ ఛాయాగ్రహణం, సిద్ధికుమార్‌ సంగీతం అందిస్తున్నారు. 

చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పెళ్లయిన మగవాళ్ల సమస్యలను స్త్రీలు కూడా అంగీకరించేలా తెరకెక్కిస్తున్న కథాచిత్రమని చెప్పారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే అవుతుందన్నారు. కాగా దీనికి బ్లాక్‌ షీప్‌ సంస్థ సహనిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం కచ్చితంగా జనరంజకంగా ఉంటుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)