Breaking News

'జిన్' సినిమా రివ్యూ

Published on Fri, 12/19/2025 - 13:29

అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాడ్ తదితరులు నటించిన సినిమా 'జిన్'. చిన్మయ్ రామ్ దర్శకుడు. నిఖిల్ ఎం. గౌడ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూవీ తాజాగా (డిసెంబరు 19) థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
ఓ కాలేజీలోని లైబ్రరీలో ఓ కుర్రాడికి వింత అనుభవం ఎదురవుతుంది. రాత్రి ఒక్కడే ఉండటంతో అతనికి వింత శబ్దాలు, వింత ఘటనలు తారసపడతాయి. ఓ నలుగురు కుర్రాళ్లు ఎగ్జామ్ రాసేందుకు భూతనాల చెరువు దాటి జ్ఞాన వికాస్ కాలేజీకి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్లకు ఎదురైన సంఘటనలేంటి? ఆ బిల్డింగ్‌లో వీళ్లు ఎలా చిక్కుకున్నారు? చివరకు బయటపడ్డారా? ఇంతకీ 'జిన్' సంగతేంటనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఫస్ట్ హాఫ్ అంతా కూడా నలుగురు కుర్రాళ్లు, వారి అల్లరి, కాలేజీ సీన్లతో టైమ్ పాస్ అయిపోతుంది. కాసేపటికి తమకు ఏర్పడిన ప్రమాదం గురించి తెలుస్తుంది. చిన్న ట్విస్ట్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ద్వితీయార్దంలో జిన్ ఎంట్రీ, పోలీసుల ఇన్వెస్టిగేషన్, కాలేజీ బిల్డింగ్‪‪‌లో ఉన్న ఆత్మల గురించి రివీల్ చేస్తూ వెళ్లారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ని బాగా ముగించారు.

అమిత్ రావ్ ఆకట్టుకున్నాడు. పర్వేజ్ సింబా బాగా చేశాడు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, పోలీస్ ఆఫీసర్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో పర్లేదనిపించారు. సాంకేతికంగానూ ఈ సినిమా బాగుంది. సునీల్ కెమెరా పనితనం, అలెక్స్ ఆర్ఆర్ మంచి అనుభూతి ఇచ్చింది. నవ్విస్తూనే భయపెట్టడంలో టీమ్ సక్సెస్ అయింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
- రేటింగ్‌: 2.5/5

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)