Breaking News

ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Tue, 07/09/2024 - 19:23

తెలుగులో ప్రతి ఏడాది 200-300 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. వాటిలో హిట్ కొట్టి నిలబడేవి పదుల సంఖ్యలో ఉంటాయి. కొన్ని చిత్రాలైతే ఎప్పుడొచ్చి వెళ్లాయనేది కూడా పెద్దగా గుర్తుండదు. అలా గతేడాది థియేటర్లలో విడుదల ఓ మూవీ.. దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?

(ఇదీ చదవండి: ప్రేమలో పడిన తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో కలిసి ఏకంగా)

అప్పట్లో 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు', 'మల్లీశ్వరి' లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కె.విజయభాస్కర్.. చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. కొడుకు శ్రీ కమల్‌ని హీరోగా పరిచయం చేస్తూ 'జిలేబి' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

ఆహా ఓటీటీలో జూలై 13 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో శ్రీ కమల్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించారు. కథ విషయానికొస్తే.. హాస్టల్ లో చదువుకునే స్టూడెంట్ కమల్ (శ్రీ కమల్). అనుకోని పరిస్థితుల్లో ఈ హాస్టల్‌లోకి లక్ష‍్మీ భారతి అలియాస్ జిలేబీ వస్తుంది. అసలు బాయ్స్ హాస్టల్‌లోకి అమ్మాయి ఎందుకొచ్చింది? చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ. మరి థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలో హిట్ సినిమా మైదాన్.. ఇకపై తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు