Breaking News

రెండు ఓటీటీలో 'జిగ్రీస్' సునామీ.. అన్-లిమిటెడ్ నవ్వుల జాతర

Published on Fri, 01/09/2026 - 17:50

ఓటీటీలో 'జిగ్రీస్' సినిమా ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. థియేటర్స్‌లో చూడాలనుకుని వెళ్లలేని వారందరూ ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ ఈ మూవీని చూస్తున్నారు. టాలీవుడ్ యువ న‌టులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్ నితిన్ నటించిన చిత్రం జిగ్రీస్‌.. నవంబర్‌ 14న విడుదలైన ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), సన్ నెక్స్ట్ (SunNXT)లో  స్ట్రీమింగ్‌ అవుతుంది.ఈ చిత్రాన్ని హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించ‌గా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ వోడపల్లి నిర్మించారు. యువ నటీనటులతో తెరకెక్కించిన జిగ్రీస్‌ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాంచ్‌ చేశారు. దీంతో మూవీకి బజ్‌ వచ్చింది.

ఈ మూవీలో కేవలం నవ్వులే కాదు, గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ కథను ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కృష్ణ బురుగుల తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తూ మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయనతో పాటు మణి వక్కా, ధీరజ్ ఆత్రేయ, రామ్ నితిన్ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. కృష్ణ వోడపల్లి నిర్మాణంలో, చిత్తం వినయ్ కుమార్ సహ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా గారి సపోర్ట్ పెద్ద బలాన్ని ఇచ్చింది. సయ్యద్ కమ్రాన్ సంగీతం, ఈశ్వరదిత్య డీవోపీ, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ వీకెండ్‌లో ఈ క్లీన్ ఎంటర్‌టైనర్‌ని అస్సలు మిస్ అవ్వకండి!

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)