ఓటీటీలో జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌.. అప్పటినుంచే స్ట్రీమింగ్‌

Published on Fri, 12/01/2023 - 11:47

రాఘవ లారెన్స్‌, ఆర్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జిగర్‌తాండ డబుల్‌ ఎక్స్‌. తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జిగర్‌తాండ (ఈ మూవీ తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా రీమేక్‌ అయింది)కు సీక్వెల్‌గా తెరకెక్కింది. నవంబర్‌ 10న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది చిత్రం. తెలుగువారికి పెద్దగా కనెక్ట్‌ అవలేదు కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది.

లారెన్స్‌, సూర్య నటనకైతే నూటికి నూరు మార్కులు పడ్డాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్‌ 8 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇంగ్లీష్‌లో కూడా త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది నెట్‌ఫ్లిక్స్‌. ఇది చూసిన అభిమానులు వెయిటింగ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కథేంటంటే.. 
కృపాకర్‌ (ఎస్‌జే సూర్య) కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించుకుంటాడు. అంతలోనే చేయని తప్పుకు ఓ హత్య కేసులో జైలుపాలవుతాడు. కర్నూల్‌లోని జిగర్‌ తాండ మర్డర్‌ క్లబ్‌ గ్యాంగ్‌స్టర్‌ సీజర్‌ (రాఘవ లారెన్స్‌)ను చంపితే  కేసు నుంచి బయటపడటమే కాకుండా తిరిగి ఎస్సై ఉద్యోగం పొందగలుగుతాడు. అందుకని సీజర్‌ను చంపే ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు ఒప్పుకుంటాడు. సీజర్‌కు హీరో అవ్వాలన్న పిచ్చి ఉందని తెలిసి దర్శకుడిగా అతడి దగ్గర చేరతాడు. మరి కృపాకర్‌ అనుకున్నది జరిగిందా? హీరోగా పేరు తెచ్చుకోవాలన్న సీజర్‌ కల నెరవేరిందా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

చదవండి: ఎవరైనా నా చేయి పట్టుకుంటారా?.. హీరోయిన్‌ పోస్ట్‌ చూశారా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)