Breaking News

'నేను వచ్చేస్తున్నా'.. జేడీ చక్రవర్తి గ్రాండ్ ఎంట్రీ

Published on Fri, 12/05/2025 - 20:02

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఖాతా లేని వాళ్లు ఎవరైనా ఉంటారా? అని ‍అడిగితే టక్కున లేరనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఈ డిజిటల్ యుగం అంతా సామాజిక మాధ్యమాల మీదనే నడుస్తోంది. ఇప్పుడంతా అరచేతిలోనే ప్రపంచం కనిపిస్తోంది. సోషల్ మీడియాతో ఒక్క రోజులోనే వరల్డ్ ‍వైడ్ ఫేమస్‌ అవుతున్న రోజులివి. మరి ఇంతలా ప్రపంచాన్ని శాసిస్తోన్న సోషల్ మీడియాలో స్టార్‌ నటుడు ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదంటే నమ్ముతారా? ‍మీరు అవునన్నా.. కాదన్నా ఇది నమ్మి తీరాల్సిందే. తాజాగా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఆ నటుడు ఎవరో మీరు చదివేయండి. 

నాగార్జున శివ మూవీలో తన విలనిజం, నటనతో మెప్పించిన జేడీ చక్రవర్తి. ఆయనకు ఇప్పటి వరకు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా లేదు. తాజాగా జేడీ చక్రవర్తి సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. జేడీ మ్యాక్స్ మోడ్‌ పేరుతో ఈ సోషల్ మీడియా అకౌంట్‌ను ఓపెన్ చేశారు. ఇందులో  జేడీకి సంబంధించిన ఓ వీడియోను కూడా చేశారు. నేను దేవున్ని నమ్మను.. నువ్వు విన్నది కరెక్టే.. నేను దేవుళ్లను నమ్ముతాను.. అందరి దేవుళ్లను నమ్ముతాను.. జై ఆంజనేయ.. కాదు.. కాదు.. జై శ్రీ హనుమాన్.. నేను వచ్చేస్తున్నా అంటూ వీడియోలో జేడీ చక్రవర్తి మాట్లాడారు. 

కాగా.. జేడీ చక్రవర్తి శివ, గాయం, సత్య లాంటి చిత్రాల్లో మెప్పించారు. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ.. సోషల్ మీడియాతో అభిమానులతో టచ్‌లోకి వచ్చేస్తున్నారు. కాగా.. జేడీ చివరిసారిగా దయా అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌ 2023లో జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)