అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
'ఇది నాకు చాలా ప్రత్యేకం'.. జేడీ చక్రవర్తి ఆసక్తికర కామెంట్స్!
Published on Sat, 08/05/2023 - 21:27
సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య , విష్ణుప్రియ, కమల్ కామరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ దయా. ఉత్కంఠ భరితమైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆగస్ట్ 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్తో ఓటీటీ అరంగేట్రం చేసిన జేడీ చక్రవర్తి వైజాగ్లో సందడి చేశారు. ఈ సందర్భంగా డిస్నీ+ హాట్స్టార్ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ అభిమానులతో సరదాగా ముచ్చటించారు.
(ఇది చదవండి: 'ఆరు నెలల పాటు సినిమాలు వదిలేశా '.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!)
జేడీ మాట్లాడుతూ.. 'డిస్నీ ప్లస్ హాట్స్టార్ కుటుంబంలో భాగమైనందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా. ఈ క్రైమ్ థ్రిల్లర్ నాకు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. ప్రతి పాత్రతో నన్ను సవాలు చేసుకోవడం, తిరిగి ఆవిష్కరించుకోవడం చేస్తుంటాను. ఈ సిరీస్లో నాకు అది దక్కింది.' అని అన్నారు. ఈ కార్యక్రమంలో, జేడీ చక్రవర్తి ప్రేక్షకులతో ఆప్యాయంగా పలకరించారు. తన పాత్రపై అభిమానుల్లో ఉన్నా సందేహాలను సమాధానాలిచ్చారు. ఆ తర్వాత అభిమానులతో సెల్ఫీలు దిగారు.
(ఇది చదవండి: 'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!)
Tags : 1