Breaking News

కృతి శెట్టి‌తో సినిమా ప్రకటించిన 'పొన్నియిన్‌ సెల్వన్‌'

Published on Thu, 07/06/2023 - 10:44

పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో అరుళ్‌మొళిగా టైటిల్‌ పాత్రను పోషించి అందరి ప్రశంసలను పొందిన నటుడు జయంరవి. ఈయన నటించిన చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కాగా తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రాన్ని వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేశ్‌ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఎల్‌కేజీ, కోమాలి, మూక్కుత్తి అమ్మన్‌, వెందు తనిందదు కాడు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈయన నిర్మిస్తున్న 25వ చిత్రం ఇది. దీనికి జీనీ అనే టైటిల్‌ను నిర్ణయించారు.

(ఇదీ చదవండి: Salaar Teaser: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తి .. 'సీజ్‌ఫైర్‌' అంటే ఏమిటో తెలుసా?)

ఈ చిత్రం ద్వారా మిష్కిన్‌ శిష్యుడు జేఆర్‌ అర్జున్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నటి కల్యాణి ప్రియదర్శన్‌, కృతి శెట్టి‌, వామిక కబి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్‌ నటి దేవయాని ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. స్థానిక తిరువేర్కాడు సమీపంలోని పీజీఎస్‌ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖుల హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. మహేశ్‌ ముత్తుసామి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ సహా ఐదు భాషల్లో రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.

(ఇదీ చదవండి: పెళ్లి కూతురి లుక్​లో​ సమంత.. వీడియో వైరల్‌)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)