Breaking News

జయం రవి, ఆర్తీ విడాకుల కేసులో మధ్యవర్తులతో చర్చలు

Published on Sun, 01/19/2025 - 07:27

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు జయం రవి (రవి మోహన్‌) భార్య ఆర్తీతో విడిపోతున్నట్లు కొద్దిరోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వీరి 14 ఏళ్ల వివాహ బంధానికి తెర పడినట్లయ్యింది. ఈ వ్యవహారంలో జయం రవి భార్య ఆర్తీ (Aarthi) నుంచి విడాకులు కోరుతూ చైన్నె కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఆయన పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇందరు మళ్లీ కలిసి జీవించడానికి సామరస్య చర్చలకు అవకాశం ఇచ్చింది. 

(ఇదీ చదవండి: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. అసలైన నిందితుడి అరెస్టు)
ఇప్పటికే జయం రవి (Jayam Ravi), ఆర్తీల మధ్య మూడు సార్లు సామరస్య చర్చలు జరిగాయి. కాగా శనివారం ఈ కేసు మరోసారి న్యాయమూర్తి తేనెతోమొళి సమక్షంలో విచారణకు వచ్చింది. దీంతో జయం రవి,ఆర్తల తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. నటుడు జయం రవి, ఆర్తీ కూడా ఆన్‌లైన్‌ ద్వారా విచారణలో పాల్గొన్నారు. కాగా వారి న్యాయవాదులు తమ క్లైంట్‌ల మధ్య శనివారం సామరస్య చర్చల కోసం మధ్యవర్తులు ఆహ్వానించినట్లు కోర్టుకు విన్నవించారు. దీంతో సామరస్య చర్చలు పూర్తి అయిన తరువాత తీర్పును ప్రకటిస్తామంటూ న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా వేశారు.

పేరు మార్చుకున్న జయం రవి.. కారణం ఇదే
జయం రవి (Jayam Ravi) పేరు మార్చుకున్నాడు. తనను ఇకపై రవి మోహన్‌(Ravi Mohan) అని పిలవాలని కొద్దిరోజుల క్రితమే తెలిపాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన కాదలిక్క నెరమలై సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందుకు కారణం ఎంటో ఇలా చెప్పాడు. 'ఈ రోజు నుంచి నా పేరు రవి లేదా రవి మోహన్‌. వ్యక్తిగతంగా కానీ, వృత్తిగతంగా కానీ ఇలాగే పిలవండి.  దయచేసి ఇకపై ప్రతి ఒక్కరూ నన్ను జయం రవి అని సంభోదించకుండా రవి/ రవి మోహన్‌ అని మాత్రమే పిలవాలని కోరుతున్నాను' అని అన్నాడు. 

జయం రవి అసలు పేరు రవి. ఆయన తండ్రి మోహన్‌ డైరెక్ట్‌ చేసిన జయం (తెలుగు జయం మూవీ రీమేక్‌) మూవీ బ్లాక్‌బస్టర్‌ కావడంతో తన పేరు జయం రవిగా మారింది. రెండు దశాబ్దాలుగా జయం రవిగానే కొనసాగిన ఆయన ఇప్పుడు తనను పాత పేరుతోనే పిలవాలని చెప్తున్నాడు. అలాగే ఈ హీరో తన పేరు మీద రవి మోహన్‌ స్టూడియోస్‌ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన బ్యానర్‌ ద్వారా మంచి కథలను అందించడంతో పాటు ప్రతిభావంతులైన కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెప్పుకొచ్చాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)