Breaking News

మాస్‌ ఎంట్రీ

Published on Sun, 06/14/2026 - 00:19

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్‌బాబు (హీరో మహేశ్‌బాబు సోదరుడు) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్‌ అజయ్‌ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నటి రవీనా టాండన్‌ కుమార్తె రాషా తడాని ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు.

చలసాని అశ్వినీదత్‌ సమర్పణలో పి. కిరణ్‌ నిర్మించిన ఈ మూవీ జూలై 9న విడుదల కానుంది. ఘట్టమనేని కృష్ణ కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం హీరోగా జయకృష్ణ నిలుస్తున్నారు. కృష్ణ ఆదేశాల మేరకు స్క్రిప్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో, ప్రోడక్షన్‌ విభాగంలో శిక్షణ పొందారు జయకృష్ణ. అదే విధంగా అమెరికా వెళ్లి నటనతో పాటు హీరోకి అవసరమైన అన్నిటిలో పక్కా ట్రైనింగ్‌ తీసుకున్నారు.

 ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై జయకృష్ణ మంచి మాస్‌ ఎంట్రీ ఇవ్వనున్నారని స్పష్టం చేసింది. అలాగే టీజర్‌ సినిమాపై మంచి క్రేజ్‌ తీసుకొచ్చింది. ఈ మూవీ నుంచి విడుదలైన జయకృష్ణ లుక్స్, టీజర్‌లోని డైలాగులు, నటన చూస్తుంటే ‘ఒక్కడు’ సినిమాలో మహేశ్‌బాబులా కనబడుతున్నాడని ఘట్టమనేని అభిమానులు అంటున్నారు. తప్పనిసరిగా కృష్ణ, మహేశ్‌బాబుల వారసత్వాన్ని నిలబెట్టే హీరో అవుతాడని, ‘శ్రీనివాస మంగాపురం’తో గ్యారెంటీగా సక్సెస్‌ అందుకుంటాడనే నమ్మకాన్ని ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)