Breaking News

11 ఏళ్ల క్రితం విడాకులు.. ఒంటరి లైఫే బాగుందన్న నటి

Published on Fri, 03/31/2023 - 20:35

సింగిల్‌గా ఉండటం ఎంతో బాగుందని అంటోంది నటి జయ ఆశన్‌. బంధాల్లో చిక్కుకోవడం కన్నా ఒంటరిగా స్వతంత్రంగా జీవించడమే బాగుందని చెప్తోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా చుట్టూ జరుగుతున్నవాటిని చూస్తుంటే ఒంటరిగా ఉండటమే నయమనిపిస్తోంది. సింగిల్‌గా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. అయితే గతంలో మాత్రం కొన్ని స్పెషల్‌ మూమెంట్స్‌ మిస్‌ అవుతున్నట్లు తెలిపింది.

కలిసి కాఫీ తాగడాలు, కబుర్లాడుకోవడాలు మిస్‌ అవుతున్నానని అనిపించేదని, కానీ అలాంటి క్షణాలను తన కుటుంబం భర్తీ చేసేదని పేర్కొంది. హ్యాపీ సింగిల్‌ అని చెప్పుకోవడానికి బదులుగా స్వీయ భాగస్వామి అని చెప్పడానికే ఇష్టపడుతుంది నటి. కాగా జయ 1998లో మోడల్‌ ఫైజల్‌ను పెళ్లి చేసుకుంది. ఇద్దరూ కలిసి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కూడా పెట్టారు. వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2012లో విడిపోయారు.

ఇకపోతే బంగ్లాదేశీ నటి జయ ఆశన్‌ మొదటగా కోకా కోలా యాడ్‌లో నటించింది. పంచమి సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌లో పలు సినిమాలు చేసిన ఆమె ఇక్కడ బెంగాలీ భాషలో అబోర్టో చిత్రం చేసింది. ఆ తర్వాత ఎక్కువగా బెంగాలీలో సినిమాలు చేస్తున్న ఈ నటి త్వరలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. అనిరుద్ధ చౌదరి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తోంది. ఇందులో పంకజ్‌ త్రిపాఠి, సంజనా సాంఘి, పార్వతి తిరువోతు, దిలీప్‌ శంకర్‌, పరేశ్‌ పహుజా, వరుణ్‌ బుద్ధదేవ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్‌ కూడా పూర్తైంది.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)