Breaking News

భర్తతో హీరోయిన్‌ తెగదెంపులు.. 'మా జీవితంలో విలన్‌..'

Published on Sun, 01/04/2026 - 18:00

బుల్లితెర జంట జై భానుషాలి - మహి విజ్ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 15 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని జై భానుషాలి, మహి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈరోజు మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఎవరి జీవితాలు వారివి. అయినప్పటికీ ఒకరికొకరం సపోర్ట్‌గా ఉంటాం. 

దారులు వేరు
మా పిల్లలు తార, ఖుషి, రాజ్‌వీర్‌లకు తల్లిదండ్రులుగా, బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా కొనసాగుతాం. వారికోసం ఏదైనా చేస్తాం. మా దారులు వేరయ్యాయి. కానీ, మా కథలో విలన్‌ అంటూ ఎవరూ లేరు. దయచేసి మా నిర్ణయాన్ని తప్పుపట్టకండి. మేము డ్రామాలు చేయడానికి బదులుగా శాంతియుతంగా ఉండటానికే సిద్ధమయ్యాం. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో నోట్‌ షేర్‌ చేశారు.

ప్రేమకథ
జై- మహి ఓ క్లబ్‌లో తొలిసారి కలిశారు. పరిచయమైన మూడు నెలల్లోనే మహి తనకు కరెక్ట్‌ పార్ట్‌నర్‌ అనిపించింది జైకి. ఇద్దరి మనసులు కలవడంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు తమ దగ్గర పనిచేసేవారికి జన్మించిన పిల్లలు రాజ్‌వీర్‌, ఖుషిల బాధ్యతను భుజానేసుకున్నారు. ఆ ఇద్దరు పిల్లలను పెంచుతున్నారు. జై దంపతులకు 2019లో ఐవీఎఫ్‌ ద్వారా కూతురు తారా జన్మించింది. ఇకపోతే 2025లోనే బుల్లితెర జంట విడిపోతున్నట్లు రూమర్స్‌ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని మహి వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు అదే నిజమని రుజువు చేస్తూ వీరు విడిపోయారు.

తెలుగు సినిమా హీరోయిన్‌
మహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్‌గా కనిపించింది. ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది. తర్వాత సీరియల్స్‌కు షిఫ్ట్‌ అయింది. జై భానుషాలి.. హేట్‌ స్టోరీ 2, ఏక్‌ పహేలీ లీలా వంటి సినిమాల్లో యాక్ట్‌ చేశాడు. అలాగే పలు సీరియల్స్‌లోనూ తళుక్కుమని మెరిశాడు. జై- మహి జంటగా నాచ్‌ బలియే అనే డ్యాన్స్‌ షో సీజన్‌ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.

చదవండి: హీరో విజయ్‌ సీఎం అవుతాడు: నటుడు సుమన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)