Breaking News

పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్‌

Published on Fri, 09/27/2024 - 19:23

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ను విచారించేందుకు  రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు.  ఈ నెల 28 వరకు నార్సింగి పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు.  అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జానీ మాస్టర్‌ చిక్కుల్లో పడ్డారు. బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కాపీని జానీ మాస్టర్‌ ముందు ఉంచి  నార్సింగి పోలీసులు విచారించారు. అయితే, బాధితురాలే తనను గతంలో వేధించిందని తాజాగా జరిగిన పోలీసుల విచారణలో జానీ మాస్టర్‌ పేర్కొన్నట్లు సమాచారం.

పోలీసుల విచారణలో నేడు (సెప్టెంబర్‌ 27) పాల్గొన్న జానీ మాస్టర్‌ కాస్త అనారోగ్యంగా ఉన్నారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు జరిపించారు. పోలీసుల విచారణలో భాగంగా బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో జానీ మాస్టర్‌ ఏకీభవించలేదని తెలుస్తోంది.  తనపై ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని జానీ మాస్టర్‌ తెలిపాడు. ఒక టీవీ కార్యక్రమంలో ప్రసారం అవుతున్న ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందని జానీ పేర్కొన్నాడు. అయితే, తను మైనర్‌గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధమని చెప్పాడు. 

తన టాలెంట్‌ను గుర్తించి మాత్రమే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చానన్నాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలే తనను మానసికంగా హింసించేదని జానీ మాస్టర్‌ తెలిపాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు బాధితురాలు తనను బెదిరించినట్లు తెలిపాడు. దీంతో ఈ సమస్యను  డైరెక్టర్ సుకుమార్  దృష్టికి తీసుకెళ్లాగా.. బాధితురాలితో మాట్లాడారు. అయినా కూడా ఆమెలో మార్పు రాలేదని అన్నాడు. తనపై కుట్ర జరిగిందని, తన వెనుక ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నాడు. తన ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారని జానీ మాస్టర్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇప్పటికే మూడు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. రేపటితో (సెప్టెంబర్‌ 28) జానీ మాస్టర్ కస్టడీ విచారణ ముగియనుంది. రేపు ఉదయం జానీ మాస్టర్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)