Breaking News

2024ని మంచి సినిమాతో ముగించాను: జాన్వీ కపూర్‌

Published on Wed, 01/01/2025 - 01:30

‘‘అమరన్‌’ సినిమాని కాస్త ఆలస్యంగా చూశాను. అయితే 2024 సంవత్సరాన్ని ఇలాంటి ఒక అద్భుతమైన, ఒక మంచి సినిమా చూసి ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ అన్నారు. శివ కార్తికేయన్, సాయిపల్లవి జోడీగా నటించిన ద్విభాషా చిత్రం (తమిళ్, తెలుగు) ‘అమరన్‌’. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించారు. 2014లో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీపావళి కానుకగా 2024 అక్టోబరు 31న విడుదలైంది. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

అంతేకాదు.. ఈ చిత్రంపై ఇప్పటికే ఎంతోమంది స్టార్స్‌ కూడా ప్రశంసలు కురిపించారు. తాజాగా జాన్వీ కపూర్‌ కూడా ‘అమరన్‌’ మూవీపై తన ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా ప్రశంసలు కురిపించారు. ‘‘అమరన్‌’ సినిమాని నేను చూడడం ఆలస్యమైంది. కానీ, ఎంతో అద్భుతమైన సినిమా. ప్రతి సన్నివేశం చాలా భావోద్వేగంతో నిండిపోయింది. ఈ ఏడాదికి ‘అమరన్’ బెస్ట్‌ మూవీ. ఈ చిత్రం నా హృదయాన్ని కదిలించింది. ఈ సినిమాలోని సన్నివేశాలు నా హృదయాన్ని బరువెక్కించాయి. ఓ ప్రేక్షకురాలిగా 2024ని ఇలాంటి ఒక మంచి సినిమాతో ముగించడం సంతోషంగా ఉంది’’ అని పోస్ట్‌ చేశారామె. కాగా ఎన్టీఆర్‌ ‘దేవర’ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం రామ్‌చరణ్‌కి జోడీగా నటిస్తున్నారు.  
 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)