Breaking News

జాన్వీ కపూర్‌కు లంబోర్గిని కారు గిఫ్ట్‌.. అందుకోసమేనా?

Published on Sat, 04/12/2025 - 13:01

నచ్చినవారికి గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. ఎవరికి తోచిన రీతిలో వారు ఆయా బహుమతులు ఇస్తుంటారు. అయితే ఇక్కడ ఓ అమ్మాయి మాత్రం ఏకంగా కోట్లు విలువ చేసే లగ్జరీ కారును తన స్నేహితురాలికి గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇంతకీ ఆ కారును అందుకుంది ఎవరో కాదు హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). సింగర్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌ అనన్య బిర్లా (Ananya Birla).. పర్పుల్‌ కలర్‌ లంబోర్గినిని జాన్వీకి శుక్రవారం నాడు గిఫ్ట్‌గా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ వ్యక్తి ఆ లంబోర్గిని కారును జాన్వీ ఇంటికి డ్రైవ్‌ చేసుకుని వెళ్లి ఇచ్చేశాడు. అంతేకాదు ఆ కారులో ఒక పెద్ద గిఫ్ట్‌ బాక్స్‌ కూడా ఉంది. ఇక లంబోర్గిని కారు విలువ దాదాపు రూ.5 కోట్లు.

ఎవరీ అనన్య బిర్లా?
బిజినెస్‌ టైకూన్‌ కుమార్‌ మంగళం- నీరజ బిర్లాల కూతురే అనన్య. ఈమె సింగర్‌ మాత్రమే కాదు ఎంటర్‌ప్రెన్యూర్‌ కూడా! తాజాగా ఆమె మేకప్‌ బ్రాండ్‌ను కూడా లాంచ్‌ చేసింది. దీనికి జాన్వీ ప్రచారకర్తగా ఉండనుందని, అందుకు కృతజ్ఞతగా ఈ బహుమతిని పంపించిందని తెలుస్తోంది.

జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురిగా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ధడక్‌ చిత్రంతో సినీప్రయాణం ఆరంభించింది. గుంజన్‌ సక్సేనా, రూహి, గుడ్‌ లక్‌ జెర్రీ, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి వంటి సినిమాలు చేసింది. దేవర: పార్ట్‌ 1 చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో పెద్ది మూవీలో యాక్ట్‌ చేస్తోంది. అలాగే ఆమె చేతిలో పరమ సుందరి, సన్నీ సంస్కారీ కి తులసి కుమారి చిత్రాలున్నాయి.

 

 

చదవండి: థియేటర్లలో ఆల్కహాల్‌ అమ్మకాలు.. తూలుతూ సినిమా చూడొచ్చు!

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)