Breaking News

నీకు ఇంకా 35 ఏళ్లే.. అమ్మను తలుచుకుంటూ జాన్వీ ఎమోషనల్!

Published on Sun, 08/13/2023 - 19:23

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఫేమ్ తెచ్చుకుంటోంది. అప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.  2018లో దఢక్ సినిమా ద్వారా అరంగేట్రం చేసిన జాన్వీ.. కొద్ది కాలంలోనే తనదైన నటనతో మెప్పించింది. అంతేకాకుండా గతేడాది మిలి చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ.. ఇటీవల వరుణ్ ధావన్ సరసన బవాల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలే బవాల్ నేరుగా ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ శ్రీదేవి 60 జయంతి కావడంతో తన తల్లిని గుర్తు చేసుకుంది జాన్వీ కపూర్. ఈ సందర్భంగా అమ్మను తలుచుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్ రాసుకొచ్చారు. 

(ఇది చదవండి: ఆ సమయంలో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా: స్టార్ డైెరెక్టర్ )

జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నీకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. నానమ్మతో సినిమా సెట్‌లో దిగిన ఈ ఫోటో మీకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి అని నాకు తెలుసు. ఈ రోజు నేను కూడా సినిమా సెట్‌లో ఉన్నా. మీరు నాతో ఇలాగే ఉండాలని నేను గతంలో కంటే ఎక్కువగా కోరుకున్నా. వాస్తవానికి మీ 35వ పుట్టినరోజని మేము అందరినీ ఒప్పించగలము.  నేను నిన్ను చూసి గర్విస్తున్నా. ఈ ప్రపంచాన్ని నీ కళ్లతో చూడగలుగతున్నా. మమ్మల్ని చూసి మీరు కూడా సంతోషిస్తారని నాకు తెలుసు. ప్రతి రోజు నిన్ను ప్రేమిస్తునే ఉంటా అమ్మా. మీరు ఈ భూమి మీద అత్యంత ప్రత్యేకమైన మహిళ. మీరు ఇప్పటికీ మాతో ఉన్నారని నాకు తెలుసు. మేము జీవితంలో ఎదగడానికి కారణం నువ్వే. ఈ రోజు నీకిష్టమైన పాయసం, ఐస్ క్రీములు తింటావని ఆశిస్తున్నా.' అంటూ ఎమోషనల్ పోస్టే చేశారు. 

కాగా.. అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లోని స్టార్ హీరోలతో సినిమాలలో  నటించింది. తన అందం, అభినయంతో కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్ దర్శకుడు బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్న శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా.. 2018లో దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఓ హోటల్‌లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఇవాళ ఆమె 60వ జయంతి కావడంతో గూగుల్ సైతం ప్రత్యేక డూడుల్‌తో ఆమెకు ఘన నివాళి అర్పించింది. 

(ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే!)

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)