Breaking News

ఆసుపత్రి నుంచి జాన్వీ కపూర్ డిశ్చార్జ్‌

Published on Sat, 07/20/2024 - 20:45

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అనారోగ్యంతో  ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. పూర్తి ఆరోగ్యంతో ఆమె తాజాగా డిశ్చార్జ్‌ అయ్యారు. ఆహారం కల్తీ కావడం వల్ల జాన్వీ అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె తండ్రి బోనీ కపూర్‌ వెల్లడించారు.

24 గంటల పాటు చికిత్స పొందిన జాన్వీ కపూర్‌ పూర్తి ఆరోగ్యంతో తన ఇంటికి చేరుకుంది. ఆమె తండ్రి బోనీ కపూర్ ఈ వార్తలను ధృవీకరించారు. ఆమె ఈ రోజు ఉదయం డిశ్చార్జ్ అయినట్లు ఆయన పేర్కొన్నారు. కాస్త నీరసంగా ఉన్నప్పటికీ మరొక రోజులో ఆమె పూర్తిగా కోలుకుంటారని తెలుస్తోంది.

చెన్నై నుంచి ముంబైకి వస్తున్న క్రమంలోనే జాన్వీ అనారోగ్యానికి గురైంది. తన ఆరోగ్యం రిత్యా బయటకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. కానీ అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకకు తప్పక వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్యం మెరుగ్గా లేకపోవడం ఆపై పెళ్లికి హాజరకావడంతో ఇబ్బందులకు గురైంది.  

వరుస సినిమాలతో జాన్వీ కపూర్‌ బిజీబిజీగా ఉన్నారు. జాన్వీ, గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మ్యాథ్యూ నటించిన ప్రధాన  ‘ఉలాజ్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె బిజీగా ఉంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా వస్తున్న ‘దేవర’లో జాన్వీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ  జాన్వీనే హీరోయిన్‌ కావడం విశేషం.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)