‘జన నాయకుడు’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Published on Thu, 07/23/2026 - 13:59

టైటిల్‌ : జన నాయకన్‌(జన నాయకుడు)
నటీనటులు: విజయ్‌, పూజా హెగ్డే, బాబీ డియోల్‌, మమితా బైజు తదితరులు
నిర్మాణ సంస్థ: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌
నిర్మాత: వెంకట్ కె. నారాయణ (కేవీఎన్)
దర్శకత్వం: హెచ్‌. వినోద్‌
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌
ఎడిటింగ్‌: ప్రదీప్ ఇ. రాఘవ్
విడుదల తేది: జులై 23, 2026

జన నాయకన్‌.. తమిళనాడు ఎన్నికల ముందు ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  విజయ్‌ చివరి చిత్రం అని చెప్పడంతో అప్పటికే  ‘జన నాయకన్‌’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఎన్నికల సమయంలో సెన్సార్‌ అడ్డంకులు ఏర్పడి, సినిమా రిలీజ్‌ కాకపోవడం.. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు పెట్టడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమా హీరో విజయ్‌ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఎలాంటి అడ్డకుంలు లేకుండా నేడు (జులై 23) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అయింది. మరి విజయ్‌ చివరి చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
దళపతి వెట్రి కొండన్‌(విజయ్‌) పోలీసు ఆఫీసర్‌. ఓ నేరం కింద ఆయన మధురై సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు.కొత్తగా వచ్చిన జైలు వార్డెన్‌(గౌతమ్ వాసుదేవ్ మీనన్),దళపతి మంచి తనం చూసి.. అనారోగ్యంతో ఉన్న తన తల్లి(రేవతి)ని చివరి సారిగా చూసేందుకు అనుమతి ఇస్తాడు. ఆ తర్వాత ఆగస్టు 15న వచ్చే సాధారణ క్షమాభిక్ష ద్వారా జైలు నుంచి విడుదలయ్యేలా చేస్తాడు. ఈ క్రమంలో జైలు జైలర్‌ కూతురు విజ్జి(మమితా బైజు)తో దళపతికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. రోడ్డు ప్రమాదంలో జైలర్‌ చనిపోవడంతో విజ్జికి అన్ని తానై చూసుకుంటాడు. 

తండ్రి కోరిక మేరకు ఆమెను ఆర్మీలో జాయిన్‌ చేయించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే విజ్జికి ఫియర్‌ ఫోబియా ఉండడంతో..ప్రేమించి వ్యక్తిని పెళ్లి చేసుకొని సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. అలాంటి విజ్జిని ఓ గ్యాంగ్‌ టార్గెట్‌ చేస్తుంది. ఆమెను చంపేందుకు ప్లాన్‌ చేస్తుంది. దీని వెనుక గ్యాంగ్‌స్టర్‌ హిమ్లర్‌(బాబీ డియోల్‌) ఉన్నాడని దళపతి తెలుసుకుంటాడు. అసలు హిమ్లర్‌ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అతని మనుషులు విజ్జిని ఎందుకు టార్గెట్‌ చేశాడు?  ఆఫ్రికాలో అల్లకల్లోలం సృష్టించిన హిమ్లర్‌..ఇండియాకు ఎందుకు వచ్చాడు? భారత్‌పై ఆయన చేసిన కుట్ర ఏంటి? దాన్ని దళపతి ఎలా అడ్డుకున్నాడు? ఈ విషయంలో జర్నలిస్ట్‌ కాయల్‌(పూజా హెగ్డే)..దళపతికి ఎలా తోడుగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘భగవంత్‌ కేసరి’ సినిమా కథని బేస్‌గా తీసుకొని, దానికి రాజకీయఅంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమే ఈ ‘జన నాయకన్‌’. హీరో విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి.. ఆయనకు ఉపయోగపడేలా పొలిటికల్‌ సీన్లను పేర్చి.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తీర్చి దిద్దారు.అయితే ఆయా సీన్లు విజయ్‌ ఫ్యాన్స్‌ని అలరిస్తాయేమో కానీ.. జనరల్‌ ఆడియన్స్‌ని మాత్రం అంతగా ఆకట్టుకోలేవు. ఇక తెలుగు ప్రేక్షకుల్లో అల్రేడీ భగవంత్‌ కేసరి చూసినవారైతే..ఓపికతో ఈ సినిమా చూడాల్సిందే.

విజయ్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఎంజాయ్‌ చేస్తారు. కేవలం అభిమానుల కోసమే అన్నట్లుగా చాలా చోట్ల హీరోకి ఎలివేషన్‌ ఇచ్చారు. యాక్షన్‌ సీన్స్‌ కూడా అదే రేంజ్‌లో ప్లాన్‌ చేశారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న..గ్యాంగ్‌ స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌..ఎలివేషన్స్‌.. భారీ యాక్షన్‌ సీన్స్‌..అన్ని ఈ సినిమాలో ఉంటాయి. కానీ ఏ ఒక్కటి కూడా కొత్తగా అనిపించవు. పైగా క్లైమాక్స్‌లో రోబోలతో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ అయితే సహనానికి పరీక్షగా మారుతుంది.  

హీరో పరిచయ సన్నివేశం నుంచి మొదలు ఫస్టాఫ్‌ మొత్తం దాదాపు ‘భగవంత్‌ కేసరి’ చూసినట్లుగానే అనిపిస్తుంది.  అయినా కూడా కొంతమేర ఎంటర్‌టైన్‌ కావొచ్చు. కానీ సెకండాఫ్‌ మాత్రం మరీ హింసాత్మకంగా మారుతుంది.  లాజిక్‌ లేని సీన్లు ఒకవైపు.. అనవసరమైన పొలిటికల్‌ డైలాగులు మరోవైపు.. సీట్లో కూర్చున్న ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా పెడతాయి.  ఇదంతా ఏం వద్దు..ఎలివేషన్స్‌..భారీ యాక్షన్‌ సీన్స్‌ ఉంటే చాలు అనుకునే వాళ్లకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. 

ఎవరెలా చేశారంటే.. 
విజయ్‌ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఎంచుకున్నాడు. దళపతి పాత్రకు తగిన న్యాయం చేశాడు. యాక్షన్‌తో పాటు ఓ పాటలో డ్యాన్స్‌ కూడా ఇరగ దీశాడు. బాబీ డియోల్‌ విలనిజం బాగానే పండింది. ఆయన పాత్రకు కూడా భారీ ఎలివేషన్స్‌ ఉంటాయి. విజ్జు పాత్రకి మమితా బైజు న్యాయం చేసింది. అయితే శ్రీలీలతో పోలిస్తే మాత్రం కాస్త వెనకే ఉందని చెప్పాలి. 

పూజా హెగ్డే తెరపై అందంగా కనిపించింది కానీ.. నటనకు పెద్దగా స్కోప్‌ దక్కలేదు. ప్రకాశ్‌ రాజ్‌ పాత్ర బాగుంది. కానీ తెలుగు డబ్బింగ్‌ మాత్రం దారుణంగా ఉంది. నాజర్‌, ప్రియమణి, రేవతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

టెక్నిక‌ల్ విషయాలకొస్తే..అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ తగ్గలేదు.
 

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)