Breaking News

విజయ్‌ దర్శకుడితో సూర్య కొత్త సినిమా!

Published on Mon, 06/15/2026 - 09:28

సూర్య మంచి జోరు మీద ఉన్నారని చెప్పవచ్చు. ఈయన ఇంతకుముందు నటించిన రెట్రో చి త్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఆయన నటించిన కరుప్పు చిత్రం సంచలన విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆయన హీరోగా నటించిన విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ప్రస్తుతం ఈయన మలయాళ దర్శకుడు జీతు మాధవన్‌ దర్శకత్వంలో తన 47వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నజ్రియా నటిస్తున్నారు.

తర్వాత టీజే.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి సూర్య రెడీ అవుతున్నట్లు సామాజక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈయన ఇటీవల జననాయకన్‌ చిత్రాన్ని చేశారు. తమిళనాడు సీఎం విజయ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదల కావలసి ఉంది. దీంతో హెచ్‌.వినోద్‌ తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సూర్య హీరోగా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

అయితే ఆయన ఇటీవలే సొంత నిర్మాణ సంస్ధను ప్రారంభించి తన శిష్యుల్లో ఒకరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆయన దర్శకత్వంలో సూర్య హీరోగా చిత్రం ఉంటుందని ఈ చిత్రానికి కథా చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇది సూర్య నటించే 49వ చిత్రం అవుతుంది. ఈ రేర్‌ కాంబో షురూ అయితే చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమానార్హం.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)