Breaking News

జాబ్ చేస్తూ యాక్టింగ్.. కానీ 25 ఏళ్లకే తనువు చాలించి

Published on Mon, 10/27/2025 - 16:43

ఈనెలలో బాలీవుడ్‌లో పలువురు సెలబ్రిటీల మరణాలు కలిచివేశాయి. వీటి నుంచి తేరుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం. 'జమత్ర' అనే వెబ్ సిరీస్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నమరాఠీ నటుడు సచిన్ చంద్‌వాడే (25) తనువు చాలించాడు. ఇంట్లోనే ఊరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రస్తుతం జమత్ర 2, అసురవన్ అనే సిరీస్‌లు చేస్తున్న సచిన్.. మరోవైపు విప్రో పుణె బ్రాంచ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కారణం ఏంటో తెలీదు గానీ ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో ఇంట్లోనే ఊరి వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇది తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు.. సచిన్‌ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ధులే సిటీకి తీసుకెళ్లారు. అలా దాదాపు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడి 24వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో తుదిశ్వాస విడిచాడు.

చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమున్న సచిన్.. అందుకు తగ్గట్లే ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు సినిమాలు, సిరీస్‪‌ల్లో నటిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం కూడా 'జమత్ర 2'లో తన పాత్ర గురించి పోస్ట్ పెట్టాడు. ఇంతలోనే ఇలా ప్రాణాలు తీసుకోవడంతో సన్నిహితులు, సహ నటీనటులు షాక్ అవుతున్నారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)