Breaking News

ఆమెకు ప్రశాంతత ఇవ్వలేదు.. 40 ఏళ్ల బంధానికి ముగింపు

Published on Sat, 08/29/2026 - 20:48

'జైలర్' సినిమాలో రజనీకాంత్ ఎంతలా హైలైట్ అయ్యారో.. విలన్‌గా చేసిన వినాయకన్ కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంలో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్న ఈ నటుడు.. ఎప్పుడో ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. గతంలో పలుమార్లు ఇతడిపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. ఆ సంగతులన్నీ పక్కనబెడితే ప్రస్తుతం ఇతడు ఒంటరిగా ఉంటున్నాడు. 40 ఏళ్ల పాటు కలిసి బతికిన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. అన్నింటికీ తన ప్రవర్తనే కారణమని చెప్పాడు.

(ఇదీ చదవండి: న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న తెలుగు హీరో)

'నాకు ఒక భార్య ఉండేది. ఇప్పుడు మేం విడివిడిగా ఉంటున్నాం. మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు కానీ కలిసి బతకడం కష్టమని విడిపోయాం. నాకు 19 ఏళ్లున్నప్పుడు ఆమెని తొలిసారి కలిశాను. మహారాజాస్ కాలేజీలో మా ప్రేమకథ మొదలైంది. తర్వాత పెళ్లి చేసుకున్నాం. దాదాపు 40 ఏళ్ల పాటు కలిసి బతికాం. ఇప్పుడు ఆమె నా జీవితంలో లేకపోవడం చాలా కష్టంగా అనిపిస్తోంది. చెప్పాలంటే డబ్బు వ్యవహారాలని చూసుకోవడం నాకు ఇబ్బందిగా మారింది. నా దగ్గర గూగుల్ పే లాంటివి కూడా లేవు. అవన్నీ ఆమెనే చూసుకునేది'

'ఆమె నన్ను భరించలేకపోయింది. అది ఆమె తప్పు కాదు. నేను ఆమెకు ప్రశాంతత ఇవ్వలేదు. ఎప్పుడూ గొడవలు, గందరగోళంతో ఉండేసరికి కలిసి బతకడం కంటే విడిపోవడమే ఇద్దరికీ మంచిదని అనుకున్నాం. అయినప్పటికీ ఆమె నాకు సంబంధించిన చాలా విషయాలు చూసుకుంటోంది. నా యూట్యూబ్‌కి రీఛార్జ్ కూడా చేస్తోంది. నేను ప్రతి విషయాన్ని ఆమెతో చెప్పేవాడిని. ఇప్పుడు ఆమె నా జీవితంలో లేదు. దీంతో నా జీవితం చీకటిగా మారిపోయింది' అని నటుడు వినాయకన్ భావోద్వేగానికి గురయ్యాడు.

మూడేళ్ల క్రితం వినాయకన్-బబిత విడిపోయారు. ఆమె బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. వినాయకన్ విషయానికొస్తే.. నటుడిగా చాలా పేరుంది. చతిక్కాత్త చంతు, చింతామణి కొలకేస్, బిగ్ బి, బ్యాచిలర్ పార్టీ, మరియన్, ఆడు, చంద్రెట్టన్ ఎవిడయా, కమ్మటిపాదం, ఆడు 2, ఈ మా యౌ, తొట్టప్పన్, పడ, ఒరుత్తీ, ఆడు 3 తదితర సినిమాల్లో నటించాడు. వంటి చిత్రాల్లో ఆయన తనదైన నటనతో మెప్పించారు. ఇకపోతే 'కమ్మటిపాదం' సినిమాకుగానూ కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడు అవార్డుని అందుకున్నాడు. ఇలాంటి నటుడి జీవితం, విడాకుల వల్ల అయోమయంగా మారిపోయింది.

(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి)

Videos

మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ

యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

ధర్మాన ప్రసాద్ పై అక్రమ కేసు

నీకే చెప్తున్నా.. జగన్ పై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన సజ్జల

బిర్యానీ సెంటర్లో పెరుగు కోసం కొట్లాట

కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి

నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?

మనిషి కంట్రోల్ తప్పిన 700 రోబోల రహస్య దాడి!

ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

Photos

+5

సమంత ప్రెగ్నెన్సీ గ్లో చూశారా? (ఫొటోలు)

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)