Breaking News

'జైలర్' విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

Published on Thu, 08/31/2023 - 14:57

సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. దాదాపు రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించారు. ఈ మూవీలో రజనీతోపాటు శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ లాంటి స్టార్స్ నటించినప్పటికీ.. విలన్‌గా చేసిన వినాయకన్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం బయటపడింది.

కేరళకు చెందిన వినాయకన్..1995 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. కెరీర్ మొదట్లో చిన్నాచితకా పాత్రలు చేసిన ఇతడు.. మెల్లమెల్లగా విలన్ తరహా పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంలోనే ఎక్కువగా మూవీస్ చేస్తూ వచ్చాడు. అయితే 'జైలర్'లో ప్రతినాయకుడిగా చేయడం ఇతడికి దక్షిణాదిలో చాలా పేరు తీసుకొచ్చింది. ఇలాంటి టైంలో ఇతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం షాకింగ్‌గా అనిపించింది.

(ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్‌ అధికారి రిలేషన్‌.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు)

ఏం జరిగింది?
ఈ సంఘటన 2019లో జరిగినట్లు తెలుస్తోంది. మోడల్ మృదులా దేవితో ఇతడు ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడాడు. ఆమెతో పాటు తల్లిని కూడా తన రూమ్‌కి తీసుకురావాలని కామెంట్ చేశాడు. ఈ విషయమై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా వాళ్లు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే వినాయకన్ కామెంట్స్ నిజమేనని తేలింది. తొలుత అరెస్ట్ చేశారు కానీ తర్వాత బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ వివాదం.. ఇప్పుడు 'జైలర్' హిట్ కావడంతో మరోసారి తెరపైకి వచ్చింది. 

తెలుగులో కూడా
అయితే ఎక్కువగా మలయాళ సినిమాలు చేసిన వినాయకన్.. తెలుగులోనూ జగపతిబాబు 'అసాధ్యుడు'లో విలన్ గ్యాంగ్‌లో ఒకడిగా చేశాడు. ప్రస్తుతం విక్రమ్-గౌతమ్ మేనన్ కాంబినేషన్ లో తీస్తున్న 'ధ్రువనక్షత్రం' మూవీలో నటిస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఏదేమైనా ఓ నటుడికి కాస్త పేరు వస్తే చాలు అతడు గతంలో చేసినవన్నీ తెరపైకి వస్తుంటాయి. 

(ఇదీ చదవండి: పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. అమ్మాయిలో ఆ క్వాలిటీస్!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)