Breaking News

'సిగ్గు లేకుండా అడుగుతున్నా': జగపతి బాబు పోస్ట్ వైరల్!

Published on Mon, 02/12/2024 - 16:59

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన జగ్గుభాయ్ ‍ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. లెజెండ్ సినిమాతో విలన్ పాత్రలో మెప్పించిన జగపతి బాబు.. ఆ తర్వాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, మహర్షి, అఖండ, సలార్‌ లాంటి సూపర్ హిట్‌  చిత్రాల్లోనూ మెప్పించారు. 

బాలనటుడిగా ఎంట్రీ

1962 ఫిబ్రవరి 12న మచిలీపట్నంలో జన్మించిన జగపతి బాబు తెలుగులో మంచి మనుషులు సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సింహ స్వప్నం అనే సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించారు. అనంతరం శుభాకాంక్షలు, శుభలగ్నం, పెళ్లి పందిరి, మావిడాకులు, పెళ్లి పీటలు లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాకుండా మనోహరం, గాయం వంటి  యాక్షన్‌ సినిమాల్లోనూ మెప్పించారు. తాజాగా ఇవాళ ఆయన 63వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా జగపతి బాబు చేసిన ఫన్నీ ట్వీట్‌ నెట్టంట తెగ వైరలవుతోంది. చేతిలో వాటర్‌ బాటిల్‌, వైన్‌ పట్టుకుని ఉన్న ఫోటోను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

 తన ట్విటర్‌లో రాస్తూ.. 'ఎలాగోలా పుట్టేశాను. సిగ్గు లేకుండా అడుగుతున్నా. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. రెండోది ఆలోచించకుండా త్వరగా డిసైడ్ చెయ్యండి. ఈ రెండిట్లో ఏది తాగమంటారు?' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. కొత్త ఏడాదిలో గుంటూరు కారం, కాటేరా సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. 

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)