Breaking News

'అందువల్లే నాకు అవకాశాలు రావడం లేదు'.. జగపతి బాబు కామెంట్స్ వైరల్!

Published on Tue, 04/02/2024 - 16:47

టాలీవుడ్‌లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. లెజెండ్‌ సినిమా తర్వాత పూర్తి స్థాయి విలన్‌గా మారిపోయారు. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ప్రభాస్ సలార్‌ మూవీలో రాజమన్నార్ పాత్రతో అభిమానులను మెప్పించారు. అంతే కాకుండా  కన్నడ మూవీ కాటేరాలో సైతం కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ నటిస్తోన్న పుష్ప-2లో జగ్గు భాయ్ నటిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అలరిస్తున్నారు. తాజాగా జగపతిబాబు ఓ వీడియోను తన ట్విటర్‌లో పంచుకున్నారు. లెజెండ్‌ తర్వాత తన కెరీర్‌లో వచ్చిన మార్పులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

జగపతి బాబు మాట్లాడుతూ..' నాకు చిన్న సినిమాలు చేయాలని కోరిక ఉంది.  కమిటేడ్‌గా చేస్తున్నారు. కొత్తగా ఉంటున్నాయి సినిమాలు. ఇక్కడ నా బ్యాడ్ లక్‌ ఏంటంటే.. నేను డబ్బున్న పేదవాడిని. నా చేతిలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఓకే. కానీ ఆ సినిమాల షూటింగ్స్ పోస్ట్‌ పోన్ అవుతూనే ఉంటాయి. ఆ సినిమాలు చేతిలో ఉన్నాయి కదా అని.. వేరే అవకాశాలు రావడం లేదు. కానీ మరోపక్క.. అమ్మో జగపతిబాబు పెద్ద సినిమాలు చేస్తున్నారు. చాలా ఎక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారని అనుకుంటున్నారని' అని చెప్పారు.

'కానీ పెద్ద సినిమాల వాయిదాల వల్ల నాకున్న చిత్రాల్లో అవకాశాలు రావడం లేదు. దీంతో అటు.. ఇటు కాకుండా అయిపోయా. గతంలో రెండు, మూడుసార్లు నా పని అయిపోయిందని ఓ స్టేజీలో నేనే అనుకున్నా. అది కూడా లెజెండ్‌ సినిమాకు రెండు నెలల ముందు. కానీ మళ్లీ వచ్చాను. మీ జగపతిబాబు ఎక్కడికీ పోడు. వెళ్లినట్లు వెళ్తాను.. కానీ మళ్లీ వస్తూనే ఉంటాను.' అంటూ వీడియోను రిలీజ్‌ చేశారు. అంతే కాకుండా లెజెండ్‌ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చారు. కాగా.. జగపతిబాబు ప్రస్తుతం పుష్ప-2  చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)