Breaking News

చిన్నారికి అరుదైన వ్యాధి.. హీరోయిన్‌ ఆపన్నహస్తం

Published on Wed, 09/10/2025 - 12:19

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ (Jacqueline Fernandez). బాబు ఇంటికి వెళ్లి తనతో కబుర్లు చెప్పి, ఆడించి నవ్వించే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులోని బాబు తల బెలూన్‌లా ఉబ్బిపోయి ఉంది. తలపై నరాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని హైడ్రోసెఫాలస్‌ (Hydrocephalus) అని పిలుస్తారు. 

అరుదైన వ్యాధి
ఈ వ్యాధి వచ్చిన శిశువుల తల అసాధారణంగా పెద్దగా ఉంటుంది. ఈ వ్యాధితో ఓ బాలుడు బాధపడుతున్నాడని తెలిసి జాక్వెలిన్‌ చలించిపోయింది. వెంటనే అతడి కుటుంబాన్ని కలిసి సర్జరీ చేయిస్తానని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ హుస్సేన్‌ మన్సూరి వెల్లడిస్తూ జాక్వెలిన్‌కు అభినందనలు తెలిపాడు. పిల్లవాడు మళ్లీ మామూలు స్థితికి వస్తాడని ఆశిద్దామని పోస్ట్‌ పెట్టాడు. 

మంచి మనసు
కాగా జాక్వెలిన్‌ పలు స్వచ్ఛంద సంస్థలకు సాయం చేస్తూ ఉంటుంది. మూగ జీవాల సంరక్షణ, పిల్లల చదువులు.. ఇలా అన్నింటికోసం పాటుపడుతూ ఉంటుంది. అలాగే శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని జనాల్లో అవగాహన కల్పించేందుకు క్యాంపెయిన్స్‌ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం జాక్వెలిన్‌.. వెల్‌కమ్‌ టు ద జంగిల్‌ సినిమా చేస్తోంది. అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

 

 

చదవండి: నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? రెచ్చిపోయిన మాస్క్‌మ్యాన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)