Breaking News

నాన్న చనిపోయిన బాధ లేదు, ఎక్స్‌పోజింగ్‌ మొదలుపెట్టావా?

Published on Mon, 01/30/2023 - 18:58

నటి, లేడీ కమెడియన్‌ రీతూ చౌదరి తండ్రి ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే! నిత్యం తండ్రిని తలుచుకుంటూ సోషల్‌ మీడియాలో బాధతో నిండిన పోస్టులు పెడుతోంది రీతూ. ఆయన జ్ఞాపకాలతోనే ఈ జీవితమంతా బతికేస్తా అంటూ ఎమోషనలవుతోంది. అయితే ఈరోజు మాత్రం సడన్‌గా పల్చటి చీర కట్టి తన అందాలు చూపిస్తూ నవ్వులు చిందిస్తూ ఓ రీల్‌ చేసింది. దీన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో నెటిజన్లు షాకయ్యారు. ఏంటక్కా ఇది? మొన్ననే కదా నాన్నని పోగొట్టుకున్నావు. ఆ బాధలో ఉండగా ఈ వీడియోలు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.

'నిన్ననే బాధతో పోస్టులు పెట్టావు, అప్పుడే గ్లామర్‌ షోనా?', 'ఛీ, నాన్న పోయిన బాధ కూడా లేదు..', 'నాన్న నాన్న అన్నావు.. అప్పుడే ఎక్స్‌పోజింగ్‌ వీడియోలు పెడుతున్నావు. మీరు నిజంగా దేవత.. మీలాంటివాళ్లు ఉండాలి.. తెలుగు అమ్మాయిలు ఎక్కడికి పోతున్నారో!', 'నాన్న చనిపోయారని అంత బాధపడ్డారు, అప్పుడే ఇంత సంతోషంగా కనిపిస్తున్నారు', 'ఏంటిదంతా? కనీసం 11 రోజుల దాకా కూడా ఆగలేవా?' అంటూ ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. అయితే రీతూ ఫ్యాన్స్‌ మాత్రం.. తను డిప్రెషన్‌ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తోంది. మీకంత బాధగా ఉంటే అన్‌ఫాలో అయిపోయిండి, తన వృత్తి అలాంటిది.. బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా..  యాక్టింగ్‌ చేయాల్సిందే! అది అర్థం చేసుకోకుండా ఎందుకలా నిందిస్తున్నారు? అని మండిపడుతున్నారు. ఈ రీల్‌ తన తండ్రి చనిపోకముందే చేసిందని, కాకపోతే కాస్త ఆలస్యంగా ఇప్పుడు పోస్ట్‌ చేసిందని రీతూను వెనకేసుకొస్తున్నారు.

చదవండి: ఇంటి అ‍ద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేని దుస్థితి

Videos

అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?

నేను నిప్పు, తెరిచిన పుస్తకం అన్నావ్ గా.. మరీ ఈ సీక్రెట్ టూర్ లు ఏంటి?

ఫ్రెండ్స్ తో పందెం కట్టి.. పెన్ను మింగేశాడు

ఈ వయసులో నీకు బుద్ధి లేదా.. MLA బుచ్చయ్య చౌదరిపై రెచ్చిపోయిన చెల్లుబోయిన

స్విట్జర్లాండ్ లో పెను విషాదం.. 40 మంది మృతి ..100 మందికి గాయాలు

చంద్రబాబు మీద ఉన్న ప్రతి కేసు రీ ఓపెన్!

బుజ్జితల్లి టాలీవుడ్ కు వచ్చేస్తుందా..

ప్రేమపెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి

800 KG కేక్ కట్టింగ్.. జగన్ ఆశీస్సులతో మనదే విజయం

జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..

Photos

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

లంగా ఓణీలో 'ఈషా రెబ్బా'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)