Breaking News

'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్

Published on Sun, 10/29/2023 - 18:03

తెలుగులో కామెడీ షో అనగానే చాలామందికి 'జబర్దస్త్' గుర్తొస్తుంది. ఓ సాధారణ కమెడియన్‌గా ఈ షోలో అడుగుపెట్టిన రాకేశ్.. ఆ తర్వాత టీమ్ లీడర్ రాకింగ్ రాకేశ్ అయ్యాడు. పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం తనే హీరోగా నటిస్తూ నిర్మిస్తూ 'కేసీఆర్' సినిమా తీస్తున్నాడు. అయితే ఈ మూవీ తీయడం కోసం ఇల్లు తాకట్టు పెట్టానని, కొందరు తనని మోసం చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఏంటీ సినిమా?
కమెడియన్ రాకేశ్.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఇప్పుడు ఏకంగా కోట్లు పెట్టి 'కేసీఆర్' అనే సినిమా తీస్తున్నారు. ఇది కేసీఆర్ జీవితం ఆధారంగా, ఆయనపై ఇష్టంతో తీస్తున్న సినిమా ఇది అని స్వయంగా రాకేశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. సినిమా అంటే కోట్ల వ్యవహారం కదా! అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయ్ అని యాంకర్ అడగడంతో.. తను ఎంతో కష్టపడి, ఇష్టంగా కట్టుకున్న ఇల్లు తాకట్టు పెట్టేశానని రాకేశ్ చెప్పుకొచ్చాడు. బినామీ డబ్బులతో నిర్మిస్తున్నాననే వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: 'కేజీఎఫ్' స్టోరీతో మరో సినిమా.. జాతీయ అవార్డుకి గురిపెట్టిన హీరో)

మోసం చేశారు!
ఈ సినిమా చేస్తానని కొందరు వ్యక్తులు తనకు మాటిచ్చారని, వాళ్లు వెనక్కి తగ్గడంతోనే ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చిందని రాకింగ్ రాకేశ్ చెప్పుకొచ్చుడ. అలానే ఓ రైటర్ మోసం చేయడం వల్ల సినిమా మొదలు కావడానికి ముందే కారు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని అన్నాడు. ఈ సినిమా నిర్మాణం గురించి తెలిసి అమ్మతో పాటు భార్య సుజాత తనని ఎంకరేజ్ చేశారని రాకేశ్ చెప్పుకొచ్చాడు.

తన భార్య సుజాత.. బ్యాంకులో దాచుకున్న డబ్బులిస్తానని తనకు ధైర్యం చెప్పిందని.. అలానే ఈ సినిమాకు రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్, క్యాస్టూమ్ డిజైనర్.. ఇలా చాలా పనుల్ని సుజూత చేస్తూ తనకు అండగా ఉందని రాకేశ్ చెప్పాడు. ఇదిలా ఉండగా కేసీఆర్ సినిమాతో తెలుగు న‌టి స‌త్య‌కృష్ణ కూతురు అన‌న్య మేన‌న్ ఇండస్ట్రీలోకి ఎంటారీ ఇస్తోంది. గ‌రుడ వేగ అంజి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త్వరలో ఈ చిత్ర రిలీజ్ డేట్ వెల్లడించనున్నారు.

(ఇదీ చదవండి: వీళ్లకేమో తిట్లు.. శివాజీకేమో బుజ్జగింపులు.. ఏంటిది బిగ్‌బాస్?)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)