Breaking News

'అందరూ ఫేక్‌.. కిర్రాక్ ఆర్పీ మోసాన్ని నా జీవితంలో మర్చిపోను'.. జబర్దస్త్ తన్మయ్

Published on Mon, 05/05/2025 - 11:38

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో తన్మయ్ ఒకరు. లేడీ గెటప్స్‌లో  జబర్దస్త్ షో మాత్రమే కాకుండా పలు షోల్లో కనిపించింది. అయితే ఊహించని విధంగా జబర్దస్త్‌కి గుడ్‌ బై చెప్పేసి ఓ టీవీ షోలో కనిపించింది. అయితే కొన్ని రోజులకు ఆ షో ఆగిపోవడంతో జబర్దస్త్‌లో రీఎంట్రీ ఇచ్చింది.  రాకింగ్ రాకేష్, చలాకీ చంటి టీమ్స్‌లో లేడీ గెటప్‌లో కనిపించింది. తాజాగా  ఓ ఇంటర్వ్యూకు తన్మయ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో పడిన కష్టాలను తలచుకుని ఎమోషనలైంది తన్మయ్. నా జీవితంలో చాలా మంది తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.  

తన్మయ్ మాట్లాడుతూ..' నన్ను మోసం చేయని వారంటూ లేరు. స్నేహితులు, బంధువులు, తెలిసినవాళ్లు కూడా చీట్ చేశారు. ఇండస్ట్రీ వాళ్లతో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. నన్ను ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తామని బెదిరించారు. ఒక పెద్ద పేరున్న వ్యక్తే.  మా జబర్దస్త్‌లోనే కొంతమంది నన్ను మోసం చేశారు. స్నేహితులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ కూడా చీట్‌ చేశారు. వారిలో కిర్రాక్ ఆర్పీ ఒకడు. అతన్ని నేను లైఫ్‌లో మర్చిపోను. నేను జబర్దస్త్ మానేసి అదిరింది షోకి వచ్చింది కూడా అతని వల్లే. అతన్ని ఒక టైమ్‌లో నా సొంత అన్నలా ట్రీట్ చేశా. కానీ అతని మైండ్ సెంట్ అంతా వేరు. కానీ నా పర్సనల్ విషయాల్లో అతని వల్ల చాలా బాధపడ్డా. ఒకానొక టైమ్‌లో తనకి నేను చాలా సపోర్ట్ చేశా. కానీ అతని వల్లే నేను జబర్దస్త్ నుంచి బయటికొచ్చేశా. ఫైనాన్షియల్‌గా అతని సపోర్ట్ చేశా. కానీ నాకు ఎలాంటి సాయం చేయలేదు. ఈ ప్రపంచంలో నాశనం చేసేది డబ్బు, నమ్మకం ఈ రెండే. మనకు సాయం చేశారన్న విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. నేను ఎంత చేశానన్నది కిర్రాక్ ఆర్పీకి తెలుసు. చాలా మంది జబర్దస్త్ వాళ్లకి తెలుసు. ఈ రోజుల్లో డబ్బు మీదే అంతా నడుస్తోంది. ఒక మనిషిని బాగుపడాలన్నా డబ్బు, నమ్మకమే.. చెడిపోవాలన్నా డబ్బు, నమ్మకమే.  కానీ మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నది మనకు మాత్రమే తెలుసు. అందరికీ నా డబ్బు, బాడీ, ఫేమ్ మాత్రమే కావాలి' అని ఆవేదన వ్యక్తం చేసింది.

(ఇది చదవండి: 'ఇక్కడికి వస్తే బ్లాక్ బస్టరే'.. తీవ్ర భావోద్వేగానికి గురైన సమంత!)

నాకంటూ నేను పర్సనల్‌గా ఏమీ దాచుకోలేదని తన్మయ్ తెలిపింది. మా నాన్న చనిపోయినప్పుడు నూక రాజు తనకు అండగా నిలిచారని చెప్పింది. ఆ రోజు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్లే వరకు తనతో పాటే ఉన్నాడని పేర్కొంది. నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని నాకు తపన ఉండేదని తెలిపింది. నా జీవితంలో మా అన్నయ్య నాకు చాలా అండగా నిలిచాడని తన్మయ్ చెప్పుకొచ్చింది. నా కోసం తను చాలా కష్టపడ్డాడని తన్మయ్ ఎమోషనల్ అయింది.

జబర్దస్త్ గురించి మాట్లాడుతూ..'నా జీవితంలో ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నది లేదు. జబర్దస్త్ వల్ల కొంచం పేరు వచ్చింది. గుంటూరులో ఒక మంచి ఇల్లు కట్టుకున్నా. ఫ్యామిలీని బాగా చూసుకున్నా. కానీ వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డా. అసలు ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు. ఒక ప్రేమ లేదు, కుటుంబం నుంచి సపోర్ట్ లేదు. బయట కూడా ఎవరూ సాయం చేయలేజు. ఎక్కడ చూసిన ఫేక్ అంతా.. నమ్మి మోసం పోవడం తప్ప చేసేదేం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Videos

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)