Breaking News

జబర్దస్త్‌ కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌ ఇల్లు చూశారా? ఎంత బాగుందో!

Published on Sat, 08/26/2023 - 14:04

ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి.. కొందరికి రాయడం ఇష్టం.. కొందరికేమో పాడటం ఇష్టం.. పెయింటింగ్స్‌ వేయడం.. డ్యాన్స్‌ చేయడం, నటించడం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోటి నచ్చుతుంది. చాలామంది దాన్ని టైంపాస్‌గా భావిస్తారు. కానీ కళాకారులు మాత్రం వాటినే నమ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. అలా హాస్యాన్ని నమ్ముకుని, అందరినీ నవ్వించడమే పనిగా పెట్టుకున్నవాళ్లు ఎంతోమంది ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. వారిలో ఒకరే జబర్దస్త్‌ కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌. 

తన పంచులతో, స్కిట్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కెవ్వు కార్తీక్‌ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఏడాది క్రితం కొత్త ఇల్లు కొనుక్కున్న కార్తీక్‌ తాజాగా హోం టూర్‌ వీడియో చేశాడు. తన ఇంటి గేటు దగ్గరి నుంచి ప్రతీది ప్రత్యేకంగా డిజైన్‌ చేయించినట్లు తెలిపాడు.

'గతంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు హోంటూర్‌ చేశాను. నేను సొంతంగా ఓ ఇల్లు కొనుకున్నాక మళ్లీ హోంటూర్‌ వీడియో చేయాలనుకున్నాను. ఏడాది క్రితమే ఈ ఇల్లు కొన్నప్పటికీ ఇంటీరియర్‌, వస్తువులు అన్నీ సమకూర్చుకునేసరికి ఇంత సమయం పట్టింది. ఇన్నాళ్లకు ఇల్లు పూర్తిగా రెడీ అవడంతో వీడియో చేశాను. గతంలో నేను కింద పడుకునేవాడిని. సోఫా కూడా ఉండేది కాదు. నాకంటూ సొంతిల్లు ఉన్నాకే అవన్నీ కొనుక్కోవాలనుకున్నాను. ఇప్పుడు అన్నీ మంచి క్వాలిటీతో ఉన్నవి కొనుక్కున్నాను' అంటూ ప్రతి గదిని క్షుణ్ణంగా చూపించాడు కార్తీక్‌.

హాల్‌, పూజ గది, డైనింగ్‌ టేబుల్‌, కిచెన్‌, మూడు బెడ్‌రూమ్స్‌, బాల్కనీ అన్నింటినీ తనకు నచ్చినట్లుగా ఆర్గనైజ్‌ చేయించుకున్నాడు. తన అవార్డులు, గృహప్రవేశానికి వచ్చిన బహుమతులను సైతం చూపిస్తూ పోయాడు. తన బాల్కనీని మొత్తం గ్రీనరీతో నింపేశాడు. ఈ ఇంట్లో నెమళ్ల శబ్ధాలు కూడా వినిపిస్తుండటం విశేషం. కాంక్రీట్‌ జంగిల్‌లో కాకుండా కాస్త ప్రశాంత వాతావరణం ఉన్న ప్రదేశంలో కార్తీక్‌ తన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అభిమానులు సైతం ఇల్లు చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎమ్మెల్యేగా పోటీ? స్పందించిన రాహుల్‌

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)