Breaking News

‘ఇసకపట్నం’ వెబ్‌సిరీస్‌ రివ్యూ

Published on Thu, 07/02/2026 - 10:22

టైటిల్‌: ఇసకపట్నం (7 ఎపిసోడ్స్‌)
నటీనటులు: ఐశ్వర్య రాజేశ్, సముద్రఖని, రాజీవ్ కనకాల, సునీల్, నరేష్ అగస్త్య, సుధాకర్ కోమాకుల, బెనర్జీ, రాజా చెంబోలు, జ్వాలా కోటి తదితరులు
దర్శకత్వం: గ్యారీ బీహెచ్
నిర్మాతలు: రాహుల్ తమడ, సందీప్ రెడ్డి బొర్ర
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసు
ఓటీటీ స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో

కథేంటంటే.. 
ఈ సిరీస్‌ కథ 1980-90 నేపథ్యంలో సాగుతుంది. ఇసకపట్నంలో నిజాయితీపరుడైన నాయకుడు చిన్నారావు(రాజీవ్‌ కనకాల. మత్సకారుల సమస్యలు పరిష్కరిస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. నాయుడు(సముద్రఖని) బతుకుదెరువు కోసం భార్య, కూతురుతో కలిసి ఇసకపట్నం వెళతాడు. చిన్నారావు దగ్గర కూలీగా చేరి..ఊహించని విధంగా గంగమ్మ జాతరలో ఆయననే హత్య చేస్తాడు. ఆ తర్వాత పోర్ట్‌ ఏరియాను తన గుప్పిట్లోకి తెచ్చుకొని డాన్‌గా ఎదుగుతాడు. తండ్రి చేసే రౌడీయిజం, అ‍క్రమాలు నచ్చని భారతి(ఐశ్వర్య రాజేశ్‌).. ఒక ఎన్జీవో సంస్థకు విరాళాలు ఇస్తూ ప్రజా సేవా చేస్తూ ఉంటుంది. భారతీని ఓ యువకుడు (సుదాకర్ కోమాకుల) ప్రేమిస్తుంటాడు. తనను ప్రేమించే వ్యక్తిని కాకుండా ధనవంతుడు ప్రతాప్ వర్మను వివాహం చేసుకొంటుంది. కానీ ప్రతాప్ వర్మ పస్ట్ నైట్‌ రోజే చనిపోతాడు. ప్రతాప్‌ వర్మ చావుకు కారణం ఎవరు? ఇసకపట్నంలో నాయుడు చేస్తున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసు అధికారి వర్మ(సునీల్‌) వేసిన ప్లాన్‌ ఏంటి? నాయుడికి కుడిభుజంగా మెలిగే కోటయ్య (బెనర్జీ) దారుణ హత్యకు గురికావడానికి గల కారణాలేంటి? ఇసకపట్నం ప్రాంతంలో జరిగిన గ్యాస్‌ లీకేజ్‌ ఘటనకు కారణం ఎవరు? భారతీ పన్నిన వ్యూహాలు ఫలించాయా లేదా? అనేది తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే.(Isakapatnam Web Series Review Telugu)

ఎలా ఉందంటే.. 
స్మగ్లింగ్‌ మాఫియా, వలస కార్మికులపై సాగే ఆధిపత్య సంఘర్షణలు, ఆదిపత్య పోరు నేపథ్యంలో తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. ఇసకపట్నం సిరీస్‌ నేపథ్యం కూడా ఇదే. దర్శకుడు గ్యారీ బీహెచ్ ఎంచుకున్న కథ పాతదే అయినా..కథనం మాత్రం కొత్తగా ఉంది. మొత్తం 7 ఎపిసోడ్స్‌తో సాగే ఈ సిరీస్‌లో మొదటి మూడు ఎపిసోడ్స్‌ కాస్త నెమ్మదిగా సాగుతాయి. పాత్రల పరిచయానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. అయితే ఒక్కో పాత్ర పరిచయం అవుతున్నకొద్ది కథపై ఆసక్తి పెరుగుతుంది.

1980 నాటి పరిస్థితులను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆనాటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కళ్లకు కట్టినట్లు చూపించాడు. నాయుడు డాన్‌గా ఎదిగిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అప్పటి నుంచే అసలు కథ ప్రారంభం అవుతుంది.  తండ్రీకూతుళ్ల మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలు తలెత్తడం..మరోవైపు నాయుడు సామ్రాజ్యానికి కూల్చేందుకు సొంత మనుషులే కుట్ర చేయడం.. పోలీసు అధికారి వర్మ కూడా మరో ఎత్తుగడతో రావడంతో తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది.  గ్యాస్ లీకేజీ ప్రమాదంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్టులు  ఆకట్టుకుంటాయి. సిరీస్‌ ప్రారంభం కాస్త నెమ్మదిగా సాగడం.. నాలుగో ఎపిసోడ్‌ నుంచి మాత్రం ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే కొన్ని బలమైన పాత్రలకు పెద్దగా పరిచయంలేని నటీనటులను ఎంపిక చేసుకోవడంతో ఆయా సీన్లు అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు మాత్రం అదిరిపోతాయి.

ఎవరెలా చేశారంటే.. 
మాఫియా డాన్‌ నాయుడి పాత్రలో సముద్రఖని ఒదిగిపోయాడు. తెరపై క్రూరత్వంగా కనిపిస్తాడు. ఈ సిరీస్‌లో ఐశ్వర్య రాజేష్‌కు మంచి పాత్ర లభించింది. విలన్‌ కూతురు అయినప్పటికీ సామాన్యులకు మంచి చేసే పాత్ర ఆమెది. భారతీ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. . పోలీస్ అధికారిగా సునీల్, ప్రేమికుడిగా సుధాకర్ కోమాకుల, ఆటో డ్రైవర్‌గా నరేష్ అగస్త్యతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సిరీస్‌ బాగుంది.  ప్రవీణ్ లక్కరాజు అందించిన నేపథ్య సంగీతం  సిరీస్‌ స్థాయిని పెంచేసింది. డైలాగులు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)