Breaking News

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన చాణక్యుడు మూవీ హీరోయిన్.. పోస్ట్ వైరల్

Published on Tue, 06/10/2025 - 21:02

బాలీవుడ్‌ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా- వత్సల్‌ సేత్ ఒకరు. తెలుగులో  చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్‌ సీరియల్స్‌లో నటించిన ఇషితా దత్తా..  ఆ తర్వాత బాలీవుడ్‌ నటుడు వత్సల్‌ సేథ్‌ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు.

తాజాగా ఈ ఈ ముద్దుగుమ్మకు రెండోసారి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా పంచుకుంది. ఇద్దరి నుంచి నలుగురిగా మారిపోయాం.. ఇప్పుడు మా ఫ్యామిలీ సంపూర్ణమైంది.. నాకు కూతురు పుట్టింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.

కాగా.. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె భర్త వత్సల్ సేత్‌  గుడ్‌ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డను తమ ఇంటికి ఆహ్వానించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. '9 ఏళ్ల పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ.. త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి' అంటూ వాలైంటైన్‌ డే రోజున పోస్ట్ చేశాడు. కాగా.. ఇషితా దత్తా, వత్సల్ సేత్‌ 2017లో పెళ్లి చేసుకున్నారు. 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' అనే టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. జూలై 19 2023న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.

సినిమాల విషయానికొస్తే ఇషిత దత్తా చివరిసారిగా థ్రిల్లర్ చిత్రం 'దృశ్యం -2'లో కనిపించింది. ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ సేత్‌ చివరిసారిగా ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్‌లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. హిందీలో దృశ్యం -1, దృశ్యం- 2 , ఫిరంగి, బ్లాంక్‌ వంటి చిత్రాల్లో నటించింది. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)