Breaking News

వయస్సు తేడా ఉన్నప్పటికీ: యంగ్ హీరో

Published on Mon, 05/26/2025 - 17:19

బాలీవుడ్ యువనటుడు ఇషాన్ ఖట్టర్‌ ప్రస్తుతం హోమ్‌బౌండ్‌ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదలకు ముందే 78వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్‌కు జాన్వీ కపూర్, నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ కూడా హాజరయ్యారు. బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇషాన్‌.. టబుతో నటించిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆమెతో ఇంటిమేట్ సీన్స్‌ చేయండపై మాట్లాడారు. ఇద్దరి మధ్య వయస్సు తేడా ఉన్నప్పటికీ ఆమెతో అలాంటి సీన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించలేదని అన్నారు.

ఇషాన్ మాట్లాడుతూ.. " నిజాయితీగా చెప్పాలంటే టబు లాంటి నటితో దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఇది మీకు వింతగా అనిపించవచ్చు.. ఆమెతో ఇంటిమేట్‌ సీన్‌ చేయడానికి నేను భయపడలేదు. నిజానికి నేను చాలా సేఫ్‌గా భావించా. ఎందుకంటే నేను ఏమి చేస్తున్నానో అర్థం చేసుకోవడమే కాకుండా.. దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లగలిగే నటితో నేను నటించా.  ‍అదే టబులో ఉన్న గొప్పదనం. మనం ఒక సన్నివేశంలో ఏమి చేస్తున్నామో దాని గురించి ఎప్పుడూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమెతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంది. ఆమె సెట్‌లో చిన్నపిల్లాడిలా ఉంటుంది. జోక్స్ వేస్తూ అందరినీ నవిస్తుంది " అని అన్నారు.

కాగా.. ఇషాన్ ఖట్టర్  గతంలో 'ఎ సూటిబుల్ బాయ్' అనే వెబ్ సిరీస్‌లో టబుతో కలిసి నటించారు. 1993లో విక్రమ్ సేథ్ రాసిన అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్‌లో టబు నటించింది. సీనియర్ హీరోయిన్‌ టబుతో ఇషాన్ ఖట్టర్‌ ఇంటిమేట్‌ సీన్స్‌ను తెరకెక్కించారు. మరోవైపు ఇషాన్ చివరిసారిగా 'ది రాయల్స్'లో కనిపించాడు. ఇది ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రంలో భూమి పెడ్నేకర్, నోరా ఫతేహి, డినో మోరియా, మిలింద్ సోమన్, ల్యూక్ కెంట్ కీలక పాత్రల్లో నటించారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)