Breaking News

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో 75 అవార్డులు గెల్చుకున్న షార్ట్‌ ఫిలిం, స్ట్రీమింగ్‌ అక్కడే!

Published on Sat, 11/18/2023 - 12:21

షష్టి, సరస్‌ లఘు చిత్రాలు అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టాయి. షష్టి లఘు చిత్రం 2022లో 35వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో 75 అవార్డులను గెలుచుకుంది. ఇక సరస్‌ అనే లఘు చిత్రం 2023లో 20వ అంతర్జాతీయ చిత్రోత్సవాల పోటీల్లో పాల్గొని 70కి పైగా అవార్డులను గెలుచుకుందని ఈ లఘు చిత్రాల దర్శకుడు జూట్‌ పీటర్‌ డెమియన్‌ పేర్కొన్నారు. ఈయన ప్రముఖ చార్టెడ్‌ అకౌంటెంట్‌ కావడం గమనార్హం.

గత 30 ఏళ్లుగా ఆ రంగంలో విశేష సేవలు అందించిన ఆయన సినిమా రంగంపై ఆసక్తితో ఆ వృత్తి నుంచి బయటకు వచ్చారు.ఆ తరువాత దర్శకుడిగా అవతారం ఎత్తి తొలి ప్రయత్నంగా షష్టి అనే లఘు చిత్రాన్ని రూపొందించారు. పలువురి ప్రశంసలను అందుకున్న ఈ లఘు చిత్రం అంతర్జాతీయ స్థాయిలో వివిధ శాఖల్లో 75 అవార్డులను గెలుచుకోవడంతో అదే ఉత్సాహంతో సరస్‌ అనే మరో లఘు చిత్రాన్ని రూపొందించారు. ఇది కూడా 70 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.

సొంత ఆలోచనలను, అనుభవాలను, కళాత్మకంగా, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చిత్రాలను ప్రేక్షకుల అందించాలన్న భావనతో తానీ రంగంలో వచ్చినట్లు జూట్‌ పీటర్‌ డెమియన్‌ పేర్కొన్నారు. కాగా షష్టి ఇప్పుడు యాపిల్‌ టీవీ అనే ఓటీటీ యాప్‌తో పాటు ఇతర యూట్యూబ్‌ చానల్స్‌లోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక సరస్‌ లఘు చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

చదవండి: డబ్బు కోసం వ్యాపారిని బెదిరించిన సల్మాన్‌ ఖాన్‌ మాజీ బాడీగార్డ్‌

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)