తారకరత్న తండ్రి గురించి ఈ విషయాలు తెలుసా?

Published on Sun, 02/19/2023 - 15:41

నందమూరి తారకరత్న ఇకలేరన్న విషయాన్ని యావత్ సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. టాలీవుడ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నలభై ఏళ్ల వయసులోనే ఆయన మన మధ్య లేకపోవడం అత్యంత దురదృష్టకరమైన విషయం. ఈ క్రమంలో ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తారకరత్నం తండ్రి మోహన కృష్ణ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన తన చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయితే తండ్రిలా నటన వైపు కాకుండా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లారు.

మోహన కృష్ణ పలు స్టార్ హీరోల సినిమాలకు కెమెరామెన్ గా కూడా పనిచేశారు. అంతే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఒకవైపు చదువుకుంటూనే కెమెరామెన్‌గా ఎదిగారు. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాకు మొదట అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఆయన పని చేశారు. ఆ తర్వాత పలు సినిమాలకు పనిచేసిన తారకరత్న తండ్రి మోహనకృష్ణ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘అనురాగ దేవత’ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. చివరగా తనయుడు తారకరత్న హీరోగా నటించిన వెంకటాద్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అప్పటి నుంచి తండ్రి ఎన్టీఆర్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారాయన.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)