Breaking News

అలనాటి స్టార్‌ హీరోయిన్‌ కూతురే అవంతిక దాసానీ!

Published on Thu, 09/01/2022 - 11:49

అవంతిక దాసానీ.. డిజిటల్‌ స్క్రీన్‌ మీద మెరిసిన మరో నటనా వారసురాలు. ‘మైనే ప్యార్‌ కియా (ప్రేమ పావురాలు)’ తో వెండి తెర సంచలనమైన తార గుర్తుంది కదా! భాగ్యశ్రీ!! అవును ఆ తల్లి బిడ్డే ఈ అవంతిక దసానీ. లండన్‌లోని క్యాస్‌ బిజినెస్‌ స్కూల్లో బిజినెస్‌ అండ్‌ మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేసొచ్చి.. నటనారంగంలో తన ప్రతిభను పరీక్షించుకోవాలనుకుంటోంది. ముందుగా డిజిటల్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చింది జీ5 ఒరిజినల్‌ ‘మిథ్య’ అనే వెబ్‌ సిరీస్‌తో. నటనారంగంలోకి రావడానికి వారసత్వం ఉపయోగపడుతోందేమో కానీ నిలబడ్డానికి మాత్రం ప్రతిభే అవసరం అని నిరూపిస్తోంది.  

► పుట్టింది, పెరిగింది ముంబైలో. తల్లి.. భాగ్యశ్రీ.. నటి. తండ్రి.. హిమాలయ్‌ దాసానీ.. బిజినెస్‌మన్‌. అవంతికకు ఒక సోదరుడూ ఉన్నాడు. అభిమన్యు దాసానీ. అతనూ నటుడే. 



► చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. ఫ్యాషన్‌ డిజైన్‌ పట్లా ప్రేమ కనబరచేది. ఇంకో వైపు కుటుంబ వ్యాపారాల్లోనూ తండ్రికి సాయంగా ఉండాలని ఉత్సాహపడేది. చివరకు నటనా రంగంలోకి రావాలనే నిర్ణయించుకుంది. 

► జీ5లో స్ట్రీమ్‌ అవుతోన్న ‘మిథ్య(2022)’తో అవంతిక తన లక్ష్యాన్ని సగం వరకు చేరుకుంది. తన అభినయాన్ని వెండితెర మీద చూపించాలనేది ఆమె లక్ష్యం. అదీ త్వరలోనే నెరవేరనుందట. 



► క్రీడల్లోనూ ఫస్టే. ఆమె..ప్రొఫెషనల్‌ కిక్‌ బాక్సర్‌. తన కిక్‌ బాక్సింగ్‌ వీడియోలకు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. 

 డాన్స్, ట్రావెలింగ్‌లు ఆమె అభిరుచులు.

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)