Breaking News

ఓటీటీలోకి 'ఇన్‌స్పెక్టర్‌ రిషి'.. ట్రైలర్‌తోనే దుమ్మురేపారు

Published on Sun, 03/24/2024 - 13:12

హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడిగా నవీన్ చంద్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సౌత్‌ ఇండియాలో సినిమాలతో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ ఆయన నటిస్తున్నారు. ఈ క్రమంలో జిగర్తాండ డబుల్ ఎక్స్‌ సినిమాతో మరింత పాపులర్‌ అయ్యారు. తాజాగా ఆయన నటించిన  ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ అనే వెబ్‌ సిరీస్‌ నుంచి ట్రైలర్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విడుదల చేసింది. మొత్తం 10 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. తెలుగు,తమిళ్‌తో పాటు ఐదు భాషల్లో మార్చి 29 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

తాజాగా విడుదలైన ట్రైలర్‌ చాలా ఆసక్తిగా ఉంది. ప్రతి సీన్‌ ప్రేక్షకుడిని సస్పెన్స్ సన్నివేశాలతో మెప్పిస్తుంది. ఊహించలేనంత విజువల్స్‌తో వస్తున్న ఈ సిరీస్‌ తప్పకుండా ప్రేక్షకులను భయపెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతు చిక్కని హత్యల వెనక ఎవరున్నారనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ మిస్టరీని ఇన్‌స్పెక్టర్‌ రిషి ఎలా ఛేదించారన్నది తెలియాలంటే ఈ సిరీస్‌ చూడాల్సిందే.

నందిని దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం, శ్రీకాంత్ దయాల్, కుమార్ వేల్ కీలకపాత్రల్లో నటించారు. ‘చట్టాలు అతీంద్రియ శక్తులను బంధించలేవు’ అనే క్యాప్షన్‌ పెట్టడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈనెల 29 నుంచి  అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)