Breaking News

నిద్రలేని రాత్రులు.. అయినా గర్వంగానే ఉంది: విజిల్‌ నటి

Published on Wed, 07/23/2025 - 19:30

ప్రముఖ కమెడియన్‌ రోబో శంకర్‌ కూతురు, హాస్య నటి ఇంద్రజ (Indraja Shankar) ఈ ఏడాది ప్రారంభంలో తల్లిగా ప్రమోషన్‌ పొందింది. 2024 మార్చిలో తన స్నేహితుడు, డైరెక్టర్‌ కార్తీక్‌తో ఇంద్రజ ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే! అదే ఏడాది ఆగస్టులో గర్భం దాల్చానంటూ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది జనవరిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడు ఏడో నెలలో అడుగుపెట్టడంతో నటి సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. 

గర్వంగా భావిస్తున్నా..
నా సంబరాల మూటకు ఆరు నెలలు నిండాయి. ఇప్పుడు ఏడో నెలలోకి వచ్చాడు. ఏడు నెలల క్రితం నువ్వు నా జీవితంలోకి వచ్చి నా ప్రపంచాన్నే మార్చేశావు. నీ చిరునవ్వులకు, నీ కౌగిలింతలకు.. ఆఖరికి నాకు అందించిన నిద్రలేని రాత్రులను కూడా నేనెంతో గర్వంగా భావిస్తున్నాను నక్షత్రన్‌ అని రాసుకొచ్చింది. ఈ మేరకు తన ప్రెగ్నెన్సీ జర్నీ నుంచి బాబును ఎత్తుకునే క్షణాల వరకు సంబంధించిన ఫోటోలు, వీడియోల క్లిప్పింగ్స్‌ను జత చేసింది.

సినిమా
కాగా ఇంద్రజ తండ్రి.. రోబో డ్యాన్స్‌తో ఫేమస్‌ అవడంతో రోబో శంకర్‌గా పాపులర్‌ అయిపోయాడు. ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' అనే చిత్రం అతడికి బాగా పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఏడాదికి 10 సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. దాదపు తమిళ స్టార్‌ హీరోలందరితోనూ పని చేశాడు. ఇంద్రజ విషయానికి వస్తే దళపతి విజయ్‌ బిగిల్‌ (తెలుగులో విజిల్‌), విశ్వక్‌సేన్‌ పాగల్‌, కార్తీ విరుమాన్‌ చిత్రాల్లో యాక్ట్‌ చేసింది. పలు టీవీ షోలలోనూ కనిపిస్తూ ఉంటుంది.

 

 

చదవండి: నాది దొంగ ఏడుపు కాదు, నేనేం పిచ్చిదాన్ని కాదు.. కాపాడండి: హీరోయిన్‌

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)