Breaking News

నటుడు 'ఆర్య' వ్యాపార కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Published on Thu, 06/19/2025 - 12:11

కోలీవుడ్‌ నటుడు ఆర్య నివాసం,  వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) ఆక‌స్మిక‌ దాడులు చేసినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆర్య నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా.. ఇటీవల సంతానం నటించిన హర్రర్ మూవీ డిడి నెక్స్ట్ లెవెల్‌ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే.. అయితే, ఈ ఉదయం చెన్నైలోని అన్నా నగర్‌లోని తను నిర్వహిస్తున్న 'సీ షెల్' హోటల్‌తో పాటు మరికొన్ని వ్యాపార కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు చేసింది. ఆర్య వ్యాపారాలు చేస్తూ.. పన్ను చెల్లించకుండా ఉన్నారని సమాచారం రావడంతో అధికారులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.

ఆర్య  ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆపై నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. చెన్నైలోని అన్నా నగర్, వేలచెరి, కొట్టివాకం, కిల్పాక్ వంటి ప్రాంతాల్లో తనకు సంబంధించిన ‘సీ షెల్’ రెస్టారెంట్ల కార్యాలయాలు, శాఖల్లో తనిఖీలు చేశారు. అయితే, ఆర్య కూడా స్పందించారు.  ‘సీ షెల్’ రెస్టారెంట్ చైన్‌ను  గతంలోనే కేరళకు చెందిన వ్యాపారి కున్హి మూసాకు విక్రయించినట్లు ఆయన చెప్పారు. కానీ, ఐటీ అధికారులు ఈ అంశం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)