Breaking News

నాలో అభద్రతా భావం.. అందుకే స్టెరాయిడ్స్ తీసుకున్నా: స్టార్ హీరో మేనల్లుడు

Published on Fri, 08/09/2024 - 19:39

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటుడు ఇమ్రాన్ ఖాన్. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరో.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తాను పడిన ఇబ్బందులపై మాట్లాడారు. తనలో అభద్రతా భావం ఎక్కువగా ఉండేదని తెలిపారు. అసలు నటుడి నేను రాణించగలనా? అని భావించేవాడినని అన్నారు. ఇలా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు పడినట్లు వెల్లడించారు.

హృతిక్ రోషన్‌, సల్మాన్ ఖాన్‌ లాంటి స్టార్స్‌లా శరీరాకృతి కలిగి ఉండాలని ప్రయత్నించినట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అందుకోసం స్టెరాయిడ్స్‌ను వినియోగించినట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. సిక్స్ ప్యాక్‌ బాడీతో సూపర్‌ హీరో లుక్‌లో కనిపించేందుకు ఇలా చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత మన లుక్ కోసం ఇలాంటి కెమికల్స్‌తో ఎలాంటి ఉపయోగం లేదని అర్థమైందని చెప్పుకొచ్చారు.  సినీ పరిశ్రమలో ఉంటే ఫేమ్‌ మాత్రమే కాదు.. చాలా ఇబ్బందులు కూడా పడాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో నటీమణులు మాత్రమే గ్లామర్‌పై దృష్టిపెట్టేవారని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయి నటులు సైతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు.

కాగా.. కిడ్నాప్, ఐ హేట్ లవ్ స్టోరీస్, లక్‌ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ పలు చిత్రాల్లో నటించారు. చివరిసారిగా 2015లో కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)