Breaking News

సజ్జనార్ సార్‌కు నా రిక్వెస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మడి రవి నాన్న

Published on Tue, 11/18/2025 - 09:26

సినిమాలను పైరసీ చేస్తూ పోలీసులతో పాటు చిత్రపరిశ్రమను ముప్పుతిప్పలు పెట్టిన ‘ఐబొమ్మ’ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయంలో నెటిజన్లు మాత్రం రవి టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు.  ఈక్రమంలోనే నటుడు శివాజీ కూడా అతని నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్‌ చేశాడు. కానీ , ఆయన తండ్రి అప్పారావు కుమారుడి గురించి పలు వ్యాఖ్యలు చేశాడు.

తన కుమారుడు రవి తప్పు చేశాడని అప్పారావు అంగీకరించారు. రవి తనను కలిసి రెండేళ్లకు పైగానే అవుతుందన్నారు. చట్ట ప్రకారం రవిని శిక్షించాలని కూడా అప్పారావు చెప్పడం విశేషం. రవి తనకు కుమారుడు అయినప్పటికీ చట్టప్రకారం జరగాల్సిన ప్రక్రియని ఎలా తప్పుబడుతానని మీడియాతో చెబుతూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆపై సీపీ సజ్జనార్‌కు రిక్వెస్ట్‌గా  ఇలా చెప్పాడు.  

'సజ్జనార్‌ సార్‌ మా మీద దయతలచి స్టేషన్‌లో వాడిని ఇబ్బంది పెట్టకండి. కానీ, మీ బాధ్యతలను విస్మరించి వాడిని వదిలేయమని నేను కోరుకోవడం లేదు. వాడికి ఒక కూతురు ఉంది. ఇప్పుడు దానిని తలుకుంటే ఏమైపోతుందోనని నాకు ఏడుపు వస్తుంది. నా మనవరాలి కోసమైన రవికి తక్కువ శిక్ష పడేలా చూడండి. కోడలు కూడా నాతో మాట్లాడదు. కానీ, నా మనవరాలు చాలా తెలివైనది. ఇప్పుడు నా బాధ అంతా దాని గురించే. మా కన్నీళ్లు చూసి సజ్జనార్‌ సార్‌కు జాలీ కలిగినా సరే చట్టం అనేది ఉంది కాబట్టి ఆయన కూడా  నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వస్తుంది. మా బాధను చూసి రవిని వదిలేయలేరు కదా.? అందుకు చట్టం ఒప్పుకోదని నాకు తెలుసు. కానీ, కనీసం కొంచెం తక్కువ శిక్షపడేలా చూస్తే చాలు. 'అంటూ అప్పారావు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)