Breaking News

‘‘మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ’’లో ప్రభాస్‌ సినిమాలకి టాప్‌ ప్లేస్‌

Published on Thu, 01/16/2025 - 13:16

ఒక ఏడాదిలో విడుదలైన సినిమాల నుంచి ప్రేక్షకాదరణను అనుసరించి టాప్‌ హిట్స్, టాప్‌ ఫ్లాప్స్‌ అంటూ జాబితాలు ప్రకటించడం మామూలే. అయితే ఇప్పుడిప్పుడే కొత్త ఏడాదిలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాలను కూడా గుర్తించి జాబితాలు ప్రకటించడం ట్రెండీగా మారింది. సినిమాలకు సంబంధించి రేటింగ్‌ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్‌లైన్‌ వేదికగా పేరున్న ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌ (ఐఎండిబి). ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఐఎండీబీ కస్టమర్ల పేజ్‌ వ్యూస్‌ ఆధారంగా 2025లో మోస్ట్‌ అవైటెడ్‌ ఇండియన్‌ మూవీస్‌ జాబితాను తాజాగా ప్రకటించింది.

 సినిమాలు, టీవీ షోలు ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి పేజ్‌కి ప్రపంచవ్యాప్తంగా  250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకులున్నారు. తమ వీక్షకుల ద్వారా ఈ మోస్ట్‌ అవైటెడ్‌ ఇండియన్‌ మూవీస్‌ జాబితాను ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం అత్యధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వాటిలో నెం.1గా  నిలిచింది సికందర్‌.

ఐఎండిబి విడుదల చేసిన 2025 మోస్ట్‌ అవైటెడ్‌ ఇండియన్‌ మూవీస్‌ లిస్ట్‌ను పరిశీలిస్తే...1. సికందర్, 2. టాక్సిక్,3. కూలీ,4. హౌస్‌ ఫుల్‌  5. బాఘీ, 6.రాజా సాబ్, 7. వార్‌ 2 8. ఎల్‌2: ఎంపురాన్‌ 9. దేవా 10. చావా 11. కన్నప్ప 12. రెట్రో 13. థగ్‌ లైఫ్‌ 14. జాట్‌ 15. స్కై ఫోర్స్‌ 16. సితారే జమీన్‌ పర్‌ 17. థామా 18. కాంతారా ఏ లెజెండ్‌: చాప్టర్‌ 1 , 19. ఆల్ఫా 20. తండెల్‌

ఈ జాబితాలోని 20 టైటిల్స్‌ లో 11 హిందీ సినిమాలు, మూడు తమిళ, తెలుగు, రెండు కన్నడ, ఒకటి మలయాళ సినిమా కావడం గమనార్హం. హౌస్‌ ఫుల్‌ 5 (నెం.4), కన్నప్ప (నెం.11), స్కై ఫోర్స్‌ (నెం.15) వంటి మూడు చిత్రాల్లో అక్షయ్‌ కుమార్‌ నటించగా, రష్మిక మందన్న3 సినిమాలు సికందర్‌ (నెం.1), చావా (నెం.10), థమా (నెం.17)లలో,  మోహన్‌ లాల్, ప్రభాస్, పూజా హెగ్డే, కియారా అద్వానీ లు రెండేసి చిత్రాల్లో నటిస్తున్నారు.

నెంబర్‌ వన్‌ కావడం సంతోషంగా ఉంది...
మోస్ట్‌ అవైటెడ్‌ ఇండియన్‌ మూవీస్‌లో నెం.1 గా  నిలిచినందుకు సికందర్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘2025 ఐఎండిబి మోస్ట్‌ అవైటెడ్‌ ఇండియన్‌ మూవీస్‌ లిస్ట్‌ లో సికందర్‌ అగ్రస్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సల్మాన్‌ ఖాన్‌ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అతని ఎనర్జీ, అంకితభావం సికందర్‌ సినిమాను మాటల్లో వర్ణించలేని విధంగా తీర్చిదిద్దాయి. అందుకు సహకరించిన నిర్మాత సాజిద్‌ నదియాడ్‌ వాలాకు ధన్యవాదాలు.  సికిందర్‌ లో ప్రతి సన్నివేశం చెరగని ముద్ర వేసేలా తీర్చిదిద్దాం. ప్రేక్షకులతో ఎప్పటికీ నిలిచిపోయేలా ప్రతి క్షణాన్ని డిజైన్‌ చేయడం కోసం నేను మనస్పూర్తిగా పనిచేశాను’’ అంటూ చెప్పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)