Breaking News

ఓటీటీల్లో వందలకొద్ది వెబ్ సిరీస్‌లు.. టాప్‌-10లో ఇండియాకు నో ప్లేస్!

Published on Thu, 12/11/2025 - 17:50

ఓటీటీలు వచ్చాక సినిమాలు,వెబ్ సిరీస్‌లకు కొదవే లేదు. కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంటాయి. ఏ భాషలో వచ్చినా సరే డబ్బింగ్‌ చేసి డిజిటల్‌గా స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ప్రతి ఏటా వందలకొద్ది చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. ప్రతివారం సరికొత్త కంటెంట్‌తో సినీ ప్రియులను వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. అలా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రిలీజైన ఆదరణ దక్కించుకున్నవి చాలానే ఉన్నాయి.

కానీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనూ ప్రతి ఏటా సరికొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌ లాంటి వాటికి మాత్రమే ఆడియన్స్‌ కనెక్ట్ అవుతున్నారు. మర్డర్ మిస్టరీ లాంటి సిరీస్‌లకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. సినీ ప్రియుల అభిరుచితి తగ్గట్టుగానే చాలా వెబ్ సిరీస్‌లు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేస్తున్నాయి. అయితే కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. చాలా వరకు మన దేశ ఆడియన్స్‌ ఆదరిస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన కంటెంట్‌ సత్తా చాటలేకపోయింది.

ఓవరాల్‌ రేటింగ్‌ పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా టాప్‌-10లో మన ఇండియన్‌ వెబ్ సిరీస్‌ ఒక్కటీ కూడా లేకపోవడం గమనార్హం. ఐఎండీబీ ప్రకటించిన టాప్-25 వెబ్ సిరీస్‌లో ఇండియా నుంచి కేవలం నాలుగు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఇందులో టాప్-15లో హర్షద్ మెహతా స్కామ్-1992 కాస్తా ఫర్వాలేదనిపించింది. ఈ లిస్ట్‌లో తొలిస్థానంలో బ్రేకింగ్ బ్యాడ్‌(9.5) అనే వెబ్ సిరీస్ నిలవగా.. బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్(9.4), ప్లానెట్ ఎర్చ్-2(9.4) రెండు, మూడు స్థానాల్లో రేటింగ్ దక్కించుకున్నాయి.

టాప్-10 విషాయానికొస్తే నాలుగు నుంచి వరుసగా.. ప్లానెట్ ఎర్త్, ది వైర్, చెర్నోబిల్, ‍అవతార్- ది లాస్ట్ ఎయిర్‌బెండర్, బ్లూ, కాస్మోస్, బ్లూ ప్లానెట్‌-2 నిలిచాయి. ఇక 11 వ ప్లేస్‌లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నిలవగా.. 12లో ది సోప్రానోస్ వెబ్ సిరీస్‌ నిలిచింది. ఇక ఇండియా నుంచి హర్షద్ మోహతా వెబ్ సిరీస్‌ స్కామ్-1992(9.2) ఈ లిస్ట్‌లో 13వ స్థానం దక్కంచుకుంది. ఆ తర్వాత ఆస్పిరెంట్స్, గుల్లక్, టీవీఎఫ్ పిచర్స్ వరుసగా 23, 24, 25 స్థానాల్లో నిలిచాయి. ఓవరాల్‌గా చూస్తే మనదేశం నుంచి ఒక్క వెబ్ సిరీస్‌ కూడా టాప్-10లో రేటింగ్ సాధించలేకపోయింది.

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)