Breaking News

అది తెలిసిన రోజు సంగీతం మానేస్తాను: ఇళయరాజా

Published on Sun, 04/20/2025 - 08:01

‘‘నాకు ఎంత సంగీతం తెలుసన్నది ముఖ్యం కాదు... సంగీతమే నా గురించి తెలుసుకుంది. నాలోంచి సంగీతం ఎలా వస్తోందో తెలియదు. ఆ సంగతి తెలిసిన మరుక్షణం సంగీతం మానేస్తాను’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. రూపేష్, ఆకాంక్షా సింగ్‌ జంటగా,  రాజేంద్రప్రసాద్, అర్చన ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్‌ ప్రభ దర్శకత్వంలో రూపేష్‌ చౌదరి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. 

హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో చిత్ర సంగీతదర్శకుడు ఇళయరాజా(Ilaiyaraaja) టీజర్‌ రిలీజ్‌ చేసిన అనంతరం మాట్లాడుతూ–‘‘షష్టిపూర్తి’ ద్వారా కొత్తవాళ్లు తొలి ప్రయత్నం చేశారు. వారిని ప్రోత్సహించాలని ఇక్కడకి వచ్చాను. ఈ సినిమాకి, పని చేసిన అందరికీ దేవుడు ఆశీస్సులు అందించాలి’’ అన్నారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ‘ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం..’ అనే పాట రాశాను. ఇళయరాజాగారి సంగీతానికి పాడాలనుకున్నా ఆ అవకాశం రాలేదు. కానీ, ఆయన సంగీతానికి పాట రాసే అవకాశం వచ్చింది. ఇదొక రకంగా నా జీవితానికి సంబంధించినదే. ఇళయరాజాపై నాకున్న అభిమాన భావానికి సంబంధించిన పాటని అనుకోండి’’ అని అన్నారు.

 

రాజేందప్రసాద్‌( Rajendra Prasad) మాట్లాడుతూ– ‘‘ఇళయరాజా సంగీతం వల్లే ‘లేడీస్‌ టైలర్‌’ సినిమా హిట్టయింది. మళ్లీ ఇన్నేళ్లకు నా సినిమాకి ఆయన సంగీతాన్ని అందించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌తో పాటు ఎంతోమందిని తన సంగీతంతో స్టార్లుగా ఇళయరాజా నిలబెట్టారు.’ అని అన్నారు. ‘‘ఇంత గొప్పవారు మా సినిమాకి పని చేయడం సంతోషంగా ఉంది’’ అని పవన్‌ ప్రభ, రూపేష్‌ అన్నారు. కాగా ఇళయరాజాకి భారతరత్న ఇవ్వాలన్న ఆకాంక్షను పలువురు ఈ వేదికపై వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్‌ రామ్, కళా దర్శకుడు తోట తరణి, గీత రచయిత చైతన్య ప్రసాద్‌ మాట్లాడారు.   

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)