Breaking News

'ఐ-బొమ్మ' నిర్వాహకుడు అరెస్ట్‌

Published on Sat, 11/15/2025 - 10:19

సినిమా పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ  (i-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా కరేబియన్ దీవుల్లో ఉంటూనే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను రవి నిర్వహిస్తున్నట్లు వారు గుర్తించారు. ఫ్రాన్స్‌ నుంచి తాజాగా అతను హైదరాబాద్‌ వచ్చినట్లు పోలీసులు సమాచారం రావడంతో పక్కా  ప్లాన్‌తో  కూకట్‌పల్లిలో రవిని అదుపులో తీసుకున్నారు. భార్యతో విడాకులు తీసుకుని ఇమ్మడి రవి ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.

సినీ పరిశ్రమకు సుమారు రూ. 3 వేల కోట్ల రూపాయల వరకు నష్టాన్ని చేకూర్చిన రవి అకౌంట్‌లో ఉన్న రూ. 3 కోట్లు ఫ్రీజ్‌ చేసినట్లు తెలిపారు. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ కాపీని ఐబొమ్మలో  రిలీజ్‌ చేయడంతో సినీ పరిశ్రమ భారీగా నష్టపోతుందని నిర్మాతలు వాపోయిన విషయం తెలిసిందే.

సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తున్న ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు గట్టిగానే కొనసాగించారు. కొద్దిరోజుల క్రితం థియేటర్‌లో సినిమాను రికార్డ్ చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న కొందరిని అరెస్టు చేశారు. అయితే, పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా ఐబొమ్మ వెబ్‌సైట్‌పై కూడా దృష్టి పెట్టారు. దీంతో ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్‌ చేశారు.
 


 

Videos

Hindupuram: జై బాలయ్య అంటూ.... టీడీపీ నాయకుల దాడి

ఐబొమ్మ వెబ్సైట్లపై కీలక సమాచారం సేకరణ

Hindupur : YSRCP కార్యకర్తలపైనా దాడిచేసిన టీడీపీ నేతలు

టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ కేసులో కీలక పరిణామం

ఆ ముస్లిం దేశాలపై ట్రంప్ యుద్ధం?

బిహార్ ఫలితాలపై కేసీ వేణుగోపాల్ హాట్ కామెంట్స్

ఆస్ట్రేలియా YSRCP NRIలపై లక్ష్మీపార్వతి ప్రశంసలు

బెట్టింగ్ యాప్ కేసులో రానాను విచారిస్తున్న సీఐడీ

విశాఖలో బస్టాండ్ లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి షాక్

నాపేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించారు:సజ్జనార్

Photos

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)