Breaking News

ఓటీటీలో అభిషేక్ బచ్చన్ సినిమా.. కానీ, షరతులు వర్తిస్తాయ్‌

Published on Sat, 01/04/2025 - 11:02

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ నటించిన కొత్త సినిమా 'ఐ వాంట్‌ టు టాక్‌' ఓటీటీలోకి వచ్చేసింది. అభిషేక్‌ ప్రధాన పాత్రలో సూజిత్‌ సర్కార్‌ తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామాగా గతేడాది నవంబర్‌ 22న విడుదలైంది. అయితే, థియేటర్స్‌లో పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించలేదు. కానీ, సినిమా చూసిన కొందరు పాజిటివ్‌ రివ్యూలు ఇవ్వండంతో నెట్టింట కాస్త క్రేజ్‌ పెరిగింది. అయితే, చాలామంది ఈ చిత్రాన్ని ఓటీటీలో వచ్చాక చూడొచ్చు అనే అభిప్రాయం ఉన్నట్లు సోషల్‌మీడియాలో వెల్లడి అయింది.

'ఐ వాంట్ టు టాక్' సినిమా ఆమెజాన్‌ ప్రైమ్‌లో తాజాగా ఎంట్రీ ఇచ్చింది. కానీ, ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సినిమా చూడాలంటే రూ. 349 చెల్లించాలని అమెజాన్‌ పేర్కొంది. అయితే,  ఉచిత స్ట్రీమింగ్ విడుదల తేదీ ఇంకా వెల్లడి కాలేదు. సాధారణంగా, ఇలా అద్దెకు ఉన్న సినిమాలు 30 రోజుల టైమ్‌లైన్ తర్వాత ఉచితంగా ప్రసారం చేయబడతాయి.

అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో ఎన్‌ఆర్‌ఐ అర్జున్ సేన్‌గా మెప్పించారు. తన డ్రీమ్‌ నిజమైన తర్వాత అకస్మాత్తుగా క్యాన్సర్‌ బారీన పడిన అర్జున్ ఆపై భార్యతో విడాకులు తీసుకోవడం. ఈ క్రమంలో తన కుమార్తెకు ఎదురైన కష్టం వంటి సీన్లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. అర్జున్‌ కేవలం 100 రోజులు మాత్రమే జీవిస్తాడని వైద్యులు చెప్పడంతో ఆయన తన కుటుంబం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది సినిమాలో ప్రధాన అంశంగా ఉంటుంది. ఎలాగైన క్యాన్సర్‌ నుంచి మరణాన్ని జయించాలని సుమారు 20 ఆపరేషన్స్‌ చేయించుకుంటాడు. అయితే, ఈ కథలో అర్జున్‌ సేన్‌ చివరికి ప్రాణాలతో బయటపడుతాడా..? ఆయన కుమార్తె పరిస్థితి ఏంటి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)