ఇప్పటికీ మేఘన నా కూతురే.. కొడుకు వివాదంపై జోగిరమేష్ రియాక్షన్
Breaking News
వరుసగా విలన్ పాత్రలు.. బాబీ డియెల్ రియాక్షన్ ఇదే..
Published on Mon, 08/24/2026 - 07:23
‘ఆష్రమ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొంది చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తున్నాడు బాబీ డియోల్. అయితే ఈ విజయమే తనకు మరో సమస్య తెచ్చిపెట్టిందని ఆయన అంటున్నాడు. వరుసగా విలన్ పాత్రలే వస్తుండడంతో తాను ఓకే తరహా పాత్రలకు పరిమితమవుతున్నానని..దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నానని ఓ సందర్భంలో తెలిపాడు.
బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా..
జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని మాట్లాడుతూ.. ‘ ఒక నటుడు ఓ తరహా పాత్రలో విజయవంతమైతే.. అలాంటి పాత్రలే మళ్లీ మళ్లీ వస్తుంటాయి. నా విషయంలోనూ అదే జరుగుతోంది. దాని నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు.
ఇటీవల తాను నటించిన ‘బందర్’ పూర్తిగా భిన్నమైన చిత్రమని చెప్పాడు. ‘ విలన్ పాత్రల్లో ఎన్నో రకాలుంటాయి. ఒక్కో పాత్రకు ఒక్కో షేడ్ ఉంటుంది. అలాంటి పాత్రలు చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ఇకపై కొన్ని వెబ్‌సిరీస్‌ల్లోనూ విభిన్నమైన పాత్రలు చేయబోతున్నా’ అని వెల్లడించాడు. కాగా ‘యానిమల్’, ‘కంగువ’, ‘ఆల్ఫా’ వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు చేయడంతో బాబీ డియోల్ విలన్‌గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
Tags : 1